జీవిత భాగస్వామిని మోసం చేస్తే కలిగే ఐదు ప్రధాన ఇబ్బందులు.. తెలుసుకుంటే మంచిదే.

-

భాగస్వామిని మోసం చేయడం క్షమించరాని చర్య. ఎన్నో రోజులుగా కలిసి జీవిస్తున్న వారిని మోసం చేయడం కరెక్ట్ కాదు. దానివల్ల అవతలి వారిలో నమ్మకం తగ్గిపోతుంది. మోసపోయామన్న భావన వారి జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తుంది. భాగస్వామిని మోసం చేస్తే కలిగే ఐదు ప్రధాన ఇబ్బందులేమిటో చూద్దాం.

మోసపోయిన వాళ్ళు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. తల్లిదండ్రుల విడాకుల వల్లే మేమిలా తయారయ్యామని పిల్లలు ఎలా ఆలోచిస్తారో, అలాగే మోసపోయిన వాళ్ళు ఆలోచిస్తారు. అది వాళ్ళని తీవ్రంగా కలచివేస్తుంది.

మోసపోయిన వాళ్ళు ప్రపంచం తల్లకిందులైపోయిందని అనుకుంటారు. మానసిక స్థిరత్వాన్ని కోల్పోతారు. ఏం ఆలోచిస్తున్నారో వారికే అర్థం కాకుండా పోతుంది. దేన్ని చూసినా భయం పట్టుకుంటుంది.

నమ్మకం పూర్తిగా తగ్గిపోతుంది. వేరే రిలేషన్ షిప్ మొదలు పెడదామనుకున్నా కూడా నమ్మకం లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేరు. అనుమానం ఎక్కువై ఆత్మీయులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఏది చెప్తే ఏమవుతుందోనన్న ఆలోచనతో అన్నీ మనసులోనే పెట్టుకుంటారు.

మోసపోయామని తెలియగానే దుఃఖం కలుగుతుంది. ఆ తర్వాత అరుస్తారు. ఆపై అవతలి వారిమీద నిందలు వేస్తారు. అటు నుండి నిందలు మీ మీద వేసుకుంటారు. ఇలా రకరకాల భావావేశాలు ఒక్కసారిగా జతకూడి ఆందోళనకి గురి చేస్తాయి.

ప్రపంచ వేరుగా చూడడం ప్రారంభిస్తుంది. పని ప్రదేశంలో, పక్కింటి వారు, ప్రతీ దగ్గర వేరుగా చూస్తూ ఇబ్బందికి గురి చేస్తారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది.

ఇలాంటి పరిస్థితులు రాకూడదనుకుంటే ఎవరికి వారు వారి భాగస్వామి పట్ల నిజాయితీగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బాధ ఎవరికైనా బాధే. ఎవరి జీవితమైనా ఒకటే.

Read more RELATED
Recommended to you

Exit mobile version