న్యూ ఇయర్ నాడు ఎన్నో అనుకుని పూర్తి చేయలేకపోతున్నారా..? ఇలా చేయండి మరి..!

-

కొత్త సంవత్సరం అంటే చాలామంది ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు. వాటిని చేయడం కోసం ఎంతగానో కష్ట పడుతుంటారు. కొంత మంది ఎన్నో అనుకుంటారు. కానీ వాటిని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొత్త సంవత్సరం మీరు అనుకున్నవి చేయాలంటే కొన్నిటిని తప్పక పాటించండి. ఇలా చేయడం వలన మీరు అనుకున్నవి సాధించడానికి అవుతుంది. కొత్త సంవత్సరం కొంత మంది కొన్నిటిని అనుకుంటూ ఉంటారు. బరువు తగ్గడం లేకపోతే బయట ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడంఇలా.

కొందరు ప్రతిరోజు వ్యాయామం చేయాలని కూడా అనుకుంటారు. కొత్త సంవత్సరం తీర్మానాలు విఫలం అవ్వడానికి వాయిదా వేయడమే ముఖ్య కారణం. ఈరోజు ఏదో ఒకటి చేసేద్దాం రేపటి నుంచి ఫోకస్ చేద్దామని చాలామంది అనుకుంటారు. కానీ అదే తప్పు. మార్పు ఇప్పటినుంచే మొదలుపెట్టాలి అని మీరు కచ్చితంగా భావించి దానిని ఆచరిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న వెంటనే చేయడానికి అవుతుంది.

కొంత మంది మొదటి రోజు ఎక్కువగా వ్యాయామం చేసి తర్వాత రోజు నుంచి వాయిదా వేస్తూ ఉంటారు. అలా అస్సలు మంచిది కాదు వీలైతే రోజు టైం ని పెంచుకుంటూ వెళ్లాలి తప్ప వాయిదా వేయడం మంచిది కాదు. ఎప్పుడైనా ఏదైనా మొదలు పెడితే కచ్చితంగా దానిని 21 రోజులు పాటు కచ్చితంగా ఆచరించాలి. ఏ ఒక్క రోజు మీరు వాయిదా వేసినా సరే అది చేయడానికి అవ్వదు. న్యూ ఇయర్ నాడు మీరు ఎప్పుడైనా ఏమైనా చేయాలనుకుంటే కచ్చితంగా దానిని సీరియస్ గా తీసుకోండి దానికి తగి ప్రయత్నాలు చేయాలి మీరు తీసుకున్న విషయంపై మీరు కఠినంగా వ్యవహరించారంటే కచ్చితంగా చేయగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version