బిగ్‌ బ్రేకింగ్‌: బ్రెజిల్‌ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌..!

-

బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారోకు కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు నిర్దారణ అయింది. ఆయనకు కోవిడ్‌-19 ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. గురువారం సాయంత్రం ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆయన మాస్క్‌తో దర్శనమిచ్చారు. కాగా ఆయనకు వైరస్‌ పాజిటివ్‌ అని తేలడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు.

Brazil's President Jair Bolsonaro got Covid-19

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశం అనంతరం బ్రెజిల్‌కు తిరిగి రాగానే బొల్సొనారో కమ్యూనికేషన్‌ సెక్రటరీ ఫాబియో వాజంగార్టెన్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన్ను పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇక వాజంగార్టెన్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆయనతో కలిసి సమావేశంలో పాల్గొన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారోకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ప్రస్తుతం బొల్సొనారోకు కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయింది.

అయితే బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారో, ఆయన కమ్యూనికేషన్‌ సెక్రటరీ ఫాబియో వాజంగార్టెన్‌ లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి సమావేశంలో పాల్గొన్నందున ఈ విషయం సంచలనం రేపుతోంది. ఆ సమావేశంలో వీరు కాకుండా ఇంకా మిగిలిన ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా, లేదా అనే విషయం తేలాల్సి ఉంది. కాగా ఈ విషయంపై అమెరికా ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news