fact check: ఉల్లితో కరోనాకు చెక్‌ పెట్టోచ్చా?

-

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని మన పూర్వీకులు నుంచి ఉన్న నానుడి. అయితే, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి ఉల్లితో చెక్‌ పెట్టోచ్చా? అవునా! ఈ మధ్య సోషల్‌ మీడియాలో ఈ వార్త చెక్కర్లు కొడుతోంది. మన వంట గదిలో కచ్చితంగా ఉండే ఉల్లిపాయ, రాక్‌ సాల్ట్‌ తినడం వల్ల కరోనా వ్యాధి తగ్గిపోతుందని, మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్‌ అవుతుందని వార్త చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇక మీరు కూడా ఒకసారి ప్రయత్నించాలని చూస్తున్నారా? ఆగండి! నిజం తెలుసుకోండి.. ఇది ఫేక్‌ వార్త. ప్రముఖ పల్మనాలజిస్ట్‌ వైద్యుడు మృణాల్‌ సిర్కార్‌ ఈ వార్తను కొట్టిపారేశారు. మనం మొదటి నుంచి పాటిస్తున్న సామాజిక దూరం, మాస్కులు ధరించడంతోనే కరోనా చైన్‌ బ్రేక్‌ అవుతుందని, ఉల్లి, ఉప్పు వార్త ఫేక్‌ వార్త అని ఆయన అన్నారు.


ఇలాంటి వార్తలను నమ్మి, ఎటువంటి ప్రయోజనం ఉండదని, మన సమయం వృథా అవుతుంది మూఢవిశ్వాసాలకు పోయి పరిస్థితిని చేజారిపోకుండా చూసుకోవాలని డాక్టర్‌ సిర్కార్‌ అన్నారు. ఒకవేళ మీకు కరోనా సోకితే వైద్యులు సూచించిన విధంగా నయం చేసుకోవాలి కానీ, ఇటువంటివి నమ్మకూడదని తెలిపారు. ఒక వాయిస్‌ మెసేజ్‌ ద్వారా సైతం ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో సైతం ఆడియో పోస్టును విడుదల చేసింది. ఉల్లిపాయ, క్రిస్టల్‌ సాల్ట్‌ తీసుకోవడం వల్ల కరోనా తగ్గుతుందనడానికి ఎక్కడా కూడా సైంటిఫిక్‌ ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. మహమ్మారిని తరమడానికి వ్యాక్సిన్‌ ఒకటే మందని, పూర్తి స్థాయిలో టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే డాక్టర్‌ను సంప్రదించాలని సూచించింది పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌. సమతూల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండి ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుందని తెలిపారు. ఈ విధంగా చాలా మంది కరోనా నుంచి రికవర్‌ అయ్యారని, ప్రోటీన్, విటమిన్, మినరల్‌తో కూడిన ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలిని పీఐబీ సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news