ఏటీఎంలో డబ్బులకు బదులు ఏం వచ్చిందో చూడండి…!

-

ఏటీఎంకు వెళ్లి కార్డుతో డబ్బులు డ్రా చేస్తే ఏం వస్తాయి? డబ్బులు కాక పెంకాసులు వస్తాయా? లేక చిత్తు కాగితాలు వస్తాయా? అని చిరాకు పడకండి. నిజంగానే చిత్తు కాగితం వచ్చింది ఏటీఎం మిషన్ నుంచి. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని హౌరా సమీపంలోని బాలీలో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటన, దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం గురించి తెగ చర్చించుకుంటున్నారు.

విజయ్ పాండే అనే వ్యక్తి డబ్బులు అవసరమై.. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంకు వెళ్లాడట. ఓ ఆరు వేలు డ్రా చేద్దామని కార్డును మిషన్ లో పెట్టి.. పిన్ నెంబర్ నొక్కాడు. తర్వాత 6000 ఎంటర్ చేశాడు. డబ్బు కూడా బయటికి వచ్చింది. కానీ.. డబ్బులను చూసి మనోడు నోరెళ్లబెట్టాడు. ఎందుకంటే.. మిషన్ లో నుంచి రెండు రెండు వేల రూపాయల నోట్లు రాగా.. వాటి మధ్యలో ఓ చిత్తు కాగితం వచ్చింది. దీంతో ఆ చిత్తు కాగితాన్ని చూసిన విజయ్ షాక్ నుంచి తేరుకొని వెంటనే సదరు బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ అధికారులు కూడా చిత్తు కాగితం రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఇక.. ఈ చిత్తు కాగితం అసలు బ్యాంకు ఏటీఏంలోకి ఎలా వచ్చిందబ్బా అని ఆరా తీస్తున్నారట. ఏంటో ఈ కలికాలం.. ఏటీఏంలలో నకిలీ నోట్లు రావడం చూశాం.. కాని ఈ చిత్తు కాగితం రావడమేందిరా బాబు అంటూ ఆ ప్రాంత వాసులు తెగ ఆందోళన పడుతున్నారట. ఇక.. మనోడికి మాత్రం రెండు వేలు బొక్క.

Read more RELATED
Recommended to you

Latest news