వింత: పాములాంటి చేపతో మత్సకారుడు…!

Join Our Community
follow manalokam on social media

మత్స్యకారుడు పాము లాంటి ఒక జీవిని పట్టుకున్నాడు. నిజంగా ఇది చాలా వింతగా ఉంది. పదునైన పళ్ళు, పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి. ఈ 39 ఏళ్ల మత్స్యకారుడు ఈ అరుదైన జీవిని పట్టుకున్నాడు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటో లో మొత్తం చేప మనకి కనబడుతోంది.

ఫేస్ బుక్ లో ఇతను పోస్ట్ చేయగా ఇప్పటివరకు 340 షేర్లు మారియో ఎన్నో కామెంట్లు వచ్చాయి. ఈ వింత జంతువుని పట్టుకున్న మత్స్యకారుడు కొన్ని విషయాలు చెప్పాడు. అయితే మొదట ఈ జీవిని చూసినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ వచ్చిందని అన్నాడు. ఇప్పటి వరకు అటువంటి వాటిని ఎప్పుడూ చూడలేదు అన్నాడు. దీని కారణంగా కొంచెం భయం కూడా పడ్డామని చెప్పాడు.

అలాగే నేట్ మరి కొన్ని విషయాలు చెప్పాడు. ఇది రియల్ లైఫ్ సీ మోనిటర్ లాగ ఉంది అని అందరూ అంటున్నారు అని అన్నారు. ఇది కొంచెం వింతగా ఉంది మరియు ఎక్కడ దొరకని అరుదైన జీవి అని చెప్పడం జరిగింది. ఈ ఫోటో చూసిన పలువురు నిన్ను కరవకుండా ఉండడం మంచిది అయింది అన్నారు. ఫ్లోరిడాలో ఇది జరిగింది.

చేప మాదిరిగా ఉన్న ఈ జీవికీ మనిషిలాగే దంతాలు ఉండడం ఆశ్చర్యకరం. ఈ వింత చేప మెల్బోర్న్ పాల్ లోర్ సమీపంలో పట్టుకున్నాడు. అలానే ఆ చేప పైన జీబ్రా లాగ గీతలు ఉన్నాయి అయితే ఒకసారి తను ఆ జీవి నోటిని తెరిచే సరికి ఎంతో షాక్ కి గురి అయ్యాడు. ఎందుకంటే ఆ పళ్ళు అచ్చం మనుషుల్లాగే ఉన్నాయి. అలాగే వరుసగా దంతాలు ఉండడం ఆశ్చర్యకరంగా మారింది. షార్క్ లాగే దానికి దంతాలు ఉన్నాయి అని అతను చెప్పాడు.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...