హీరో అయిన కాకి… చూసి బుద్ది తెచ్చుకోవాలంటున్న నెటిజ‌న్లు

ప్ర‌స్తుత స‌మాజంలో ఎవ‌రి బీజీ లైఫ్‌లో వాళ్లు ఉంటూ ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌ట్టించుకోవ‌డ‌మే మానేసారు. అయితే మ‌రికొంద‌రు బీజీ కాక‌పోయినా కావాల‌ని ప‌ర్యావ‌ర‌ణాన్ని నాశ‌నం చేస్తారు. ఇప్పుడు వీళ్లంద‌రికి ఓ కాకి బుద్ది చెప్పింది. ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతూ ఇంట‌ర్నెట్ హీరోగా మ‌రిన‌ ఈ కాకిని చూసి నేటి స‌మాజం బుద్ధి తెచ్చుకోవాలి. వైర‌ల్ అవుతున్న ఈ విడియోలో కాకి ప‌ర్యావ‌ర‌ణం గురించి ఆలోచించిన‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది.

అస‌లు విష‌యంలో వెళ్తే.. ప్లాస్టిక్‌ బాటిల్‌ను నోటితో పట్టుకుని రీసైకిల్‌ డస్ట్‌ బిన్‌మీద వాలిన ఓ కాకి బాటిల్‌ను డస్ట్‌బిన్‌ లోపల వేయటానికి ప్రయత్నిస్తుంది. కొద్దిసేపు ప్రయత్నించి దాన్ని లోపలపడేసి ఎగురుకుంటూ వెళ్లిపోతుంది. ఆ కాకి చేసిన ఓ చిన్న ప‌నికి ప్ర‌పంచ వ్యాప్తంగా హీరో మారింది.  ఈ వీడియోను ఒక ట్విట్టర్‌లో షేర్ చేశారు.అయితే వీడియో వైరల్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

ఇది 2.2 మిలియన్ల సార్లు వీక్షించబడింది. 1.5 లక్షలకు పైగా లైక్‌లు మరియు 64,000 కంటే ఎక్కువ రీట్వీట్‌లను సంపాదించింది. దీనిపై నెటిజ‌న్లు కాకిని ప్ర‌శంసించ‌మేకాక‌.. కాకుల‌ను చూసి మ‌నుషులు నేర్చుకోవాల‌ని కామెంట్లు చేశారు. మ‌రికొంద‌రు ఒక పక్షి ఖాళీ బాటిల్‌ను డస్ట్‌బిన్‌లో విసిరితే, మానవులు ఎందుకు చేయలేరని కొందరు తమ ఆలోచనలను వినిపించారు. నిజానికి ఓ కాకి చేసిన చిన్న ప‌నికి మ‌నుషులు మేల్కోవ‌డానికి ఉదాహ‌ర‌ణ‌గా మారింది.