మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్.. వానలోనైనా తడవకుండా గూటికి చేరే ఏకైక పక్షి ఏదో తెలుసా?

-

మనకు తెలియని కొన్ని విషయాలు.. తెలుసుకున్నప్పుడు ఆసక్తిగా అనిపిస్తుంది.. అరే అవునా అనిపిస్తుంది. మీరు రెస్టారెంట్ కు వెళ్లి తినేసి వచ్చేప్పుడు వెయిటర్ కు టిప్ ఇచ్చేఉంటారు. మనం ఎక్కువ టిప్ప్ ఇస్తే.. వెయిటర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.. కానీ ఆ దేశంలో టిప్ ఇవ్వడం అవమానంగా భావిస్తారట.. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ మీకోసం పట్టుకొచ్చాం.. చూసేయండి అవేంటో.

అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

ప్రపంచంలో ఎక్కువమందికి ఉన్న మొదటి పేరు మహమ్మద్.

ప్రపంచంలో చమురును అధికంగా ఎగుమతి చేసే దేశం నార్వే

పెంగ్విన్‌ పక్షులు దంతాలు లేకపోయినా కరుస్తాయి.

1992 నుంచి MMSలు పంపే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాములు ఆ ప్రయాణానికి ముందు బీన్స్‌ తినరు.

ఆరోగ్యవంతమైన మనిషి రోజుకు పదమూడుసార్లు నవ్వుతాడట

గులాబీ మొక్కలు 20 కోట్ల ఏళ్లనుండీ పుష్పిస్తున్నాయట..!

రోజుకి అంతరిక్షం నుంచి 2 వేల పౌండ్ల దుమ్ము, ధూళి భూమిపైకి చేరుకుంటుంది.

అమెరికన్లు ప్రతి సంవత్సరం తినే అరటిపండ్ల సంఖ్య ఏంతో తెలుసా..?! 1,100 కోట్లు అట..!

ఐస్‌లాండ్ దేశంలో హోటల్ వెయిటర్లు టిప్ తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తారట.

ఒక వయోలిన్ తయారు చేయడానికి 70 వేర్వేరు కలప ముక్కల్ని ఉపయోగిస్తారు.

ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది
.
గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ తగ్గుతుంది.

న్యూజిలాండ్‌లోని “కీ” అనే పక్షి కారు కిటికీల చుట్టూ అమర్చే రబ్బరును తినేందుకు అమితంగా ఇష్టపడుతుందట.

వెనిజులాకు చెందిన ఒక జాతి గబ్బిలం హోరున వర్షం పడుతున్నపుడు కూడా ప్రతీ చినుకునూ తప్పించుకుంటూ తన గూటికి తడవకుండా చేరగలుగుతుందట.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version