వైరల్ వీడియో; కోతి హగ్ చూడండి ఎంత అందంగా ఉందో…!

-

హగ్… చాలా మంది ఎదుటి వారి నుంచి ఆశించేది. ప్రేమగా ఇచ్చే హగ్ లో ఉన్న మాధుర్యం దేనిలో కూడా ఉండదు అనేది వాస్తవం. ఎవరు అయినా సరే ఎంత కోపంగా అయినా ఉండనివ్వండి ఒక మంచి హగ్ ఇస్తే కూల్ అవుతారని అంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక ఫోటో. ఈ ఫోటోలో ఒక కోతి మరో కోతికి హగ్ ఇస్తుంది. ఆ ఫోటోని ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

దీనికి సంబంధించిన వీడియో ని అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అందరికీ ప్రేమ కావాలని… ప్రమాదం పొంచి ఉందని భావించిన రెండు గోల్డెన్‌ మంకీలు ఇలా ఒకటినొకటి హత్తుకున్నాయని ఆయన పోస్ట్ చేసారు. ఆ శబ్దాలే అక్కడేం జరిగిందో చెబుతున్నాయని… మనుషుల వలె అవి కూడా ఇలా భావోద్వేగాలు పలికించాయని పేర్కొన్నారు ఆయన.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతుంది. ఏ మనిషికి అయినా ఎదుటి మనిషి ఒక ధైర్యం అని.. అలాంటి ధైర్యాన్ని మనం వాళ్లకు ఇస్తే జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం ఇచ్చినట్టు అవుతుంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండకుండా ఎదుటి వారికి హగ్ ఇచ్చి ప్రేమను చాటండి అని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version