బాత్ రూమ్ కి వెళ్తున్నారా…? జాగ్రత్త…!

-

యుకె మహిళ తన బాత్రూంలో భారీ పామును చూసి షాక్ అయ్యింది. యుకెలోని బిర్కెన్‌హెడ్ పట్టణంలోని ఒక మహిళా తన ఇంటికి వెళ్ళగా తన స్నానాల గదిలో 8-అడుగుల బోవా కన్‌స్ట్రిక్టర్‌ ని చూసి ఒక్కసారిగా షాక్ తింది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చింది ఆమె. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు అధికారులు, బాత్ రూమ్ లోని సింక్ పై ఆ పాము ఉన్నట్టు గుర్తించారు.

ఈ విషయాన్ని మెర్సీసైడ్ పోలీసులు సోమవారం ఫేస్‌బుక్ పోస్ట్‌లో వెల్లడించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాములలో ఒకటి అని అధికారులు పేర్కొన్నారు. పాము ఎక్కడ నుండి వచ్చిందో ఆ మహిళకు లేదా ఆమె పొరుగువారికి తెలియదని మెర్సీసైడ్ పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటన 2019 డిసెంబర్ 30 న జరిగిందని, అయితే నిన్న ఫేస్‌బుక్‌లో భారీ పాము,

రెండు ఫోటోలను పోస్ట్ చేసామని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక మహిళ అయితే, తాను ఆ పాముని చూడగానే గుండె ఆగిపోతుందని అనగా, మరికొందరు అయితే ఆ పాముని తాము చూస్తే ఇక తమకు పీడకలలు వస్తాయని చెప్పారు. బాత్ టబ్ లో ఉన్న ఆ పాము ఇప్పుడు బాత్ రూమ్ కి వెళ్ళాలి అనుకునే వారిని వెళ్ళనివ్వదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

For many the thought of an 8ft Boa Constrictor can cause HISS-teria, but for our officers rescuing the snake was all in a day's work. Want to know more ?? https://crowd.in/5JMoZX

Posted by Merseyside Police on Monday, 20 January 2020

Read more RELATED
Recommended to you

Latest news