ఇండ్లలోకి పాములు రావడం అన్నది సహజమే. అనేక మంది ఇండ్లలోకి అప్పుడప్పుడు పాములు వచ్చి భయ పెడుతుంటాయి. అయితే ఏ పని చేసేముందైనా జాగ్రత్తగా ఒక్కసారి అన్ని ప్రదేశాలను చూడాలి. ఎందుకంటే ఆయా ప్రదేశాల్లో మన కళ్లకు సరిగ్గా కనిపించకుండా పాములు ఉంటాయి. అజాగ్రత్తగా ఉంటే వాటి కాటుకు బలవ్వాల్సి వస్తుంది. ఓ మహిళకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కానీ ఆమె పామును ముందుగానే కనిపెట్టింది. కనుక బతికిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
టుక్సాన్ అనే ప్రాంతంలో ఉండే ఓ మహిళ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్ ఫుడ్‌ను బయట పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ ర్యాటిల్ స్నేక్ ఆ ఫుడ్ బాక్స్‌పైకి ఎక్కి అలాగే ఉంది. ఆ ఫుడ్‌ను తీసుకునేందుకు వచ్చిన మహిళ కొంచెం ఉంటే ఆ బాక్స్ ను పట్టుకుని ఉండేది. ఎందుకంటే ఆ బాక్స్‌పై అసలు పాము ఉన్నట్లు కనిపించలేదు. అయితే ఆమె ఎలాగో ఆ బాక్స్ మీద పాము ఉందని గ్రహించింది. దీంతో మొదట షాక్ అయినా తరువాత స్నాక్ క్యాచర్స్ ను పిలిచింది.
ఈ క్రమంలో స్నేక్ క్యాచర్స్ ఆ పామును పట్టుకుని తీసుకెళ్లారు. అదే సమయంలో వారు దాని ఫొటోను కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటో వైరల్ గా మారింది. అయితే అందులో పాము ఎక్కడ ఉందో నిజంగా చాలా మంది కనిపెట్టలేకపోతున్నారు. చాలా సేపు జాగ్రత్తగా చూస్తే తప్ప పాము ఉందని తెలియడం లేదు. కనుక ఎవరైనా సరే.. ఏ పని చేసే ముందైనా కాస్త ముందు వెనుకా చూసి చూస్తే బాగుంటుంది. లేదంటే అలాంటి అనుకోని ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది.