”ఉగాది పచ్చడి” ని ఇలా తయారు చేస్తే… ఎంతో రుచిగా ఉంటుంది..!

-

ఉగాది అంటే మనకి మొదట గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి. ప్రతి ఇంట్లో కూడా ఉగాదినాడు ఉగాది పచ్చడి చేసుకుంటారు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. పులుపు ఉప్పు కారం వగరు తీపి చేదు ఈ ఆరు రుచులు కూడా ఉగాది పచ్చడిలో ఉండాలి. అప్పుడే అది ఉగాది పచ్చడి అవుతుంది.

ఉగాది పచ్చడిని ఎవరికి నచ్చిన స్టైల్ లో వాళ్లు చేస్తూ ఉంటారు కొందరు అందులో పుట్నాల పప్పు వంటివి కూడా వేస్తూ ఉంటారు. కానీ ఈ స్థాయిలో మీరు ఉగాది పచ్చడి చేస్తే అది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అందరికీ కూడా నచ్చుతుంది. మరి ఇక అందరికీ నచ్చేలా ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ఉగాదిని కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రలో కూడా వేరువేరు పేర్లతో ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడిలో చింతపండు వేప పువ్వు బెల్లం మామిడి ఇటువంటివన్నీ కూడా వేస్తారు. అరటి పళ్ళు, మామిడి కాయలు, జామకాయలు కూడా కొంత మంది వేసుకుంటూ ఉంటారు. ఇక ఉగాది పచ్చడి కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు:

మామిడికాయ- 1
వేప పువ్వు- అర కప్పు
వంద గ్రాముల చింతపండు
వంద గ్రాముల బెల్లం
సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు
మిరపకాయలు
అరటిపండు
చెరకు రసం
ఉప్పు
నీళ్లు
అరటి పళ్లు, జామకాయలను లేదా మీకు నచ్చేవి ఏమైనా

తయారు చేసే పద్దతి:

ముందు వేప పువ్వుని శుభ్రం చేసుకోండి. చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టండి గుజ్జులాగ తీయండి. ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అన్నిటిని కూడా కట్ చేసి పక్కన ఉంచుకోండి. చెరుకు రసాన్ని కూడా రెడీగా ఉంచుకోండి. మిగిలిన పండ్లన్నీ కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకోండి. తర్వాత తురిమిన బెల్లాన్ని చింతపండు గుజ్జు లో వేసి కలపండి ఈ మిశ్రమంలో మిరపకాయ ముక్కలు పండ్ల ముక్కలు కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోండి చివరగా కొంచెం ఉప్పు వేసుకోండి అంతే ఉగాది పచ్చడి సిద్ధం అయిపోయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news