బతుకుమ్మ స్పెషల్:అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవెద్యం ఏంటో తెలుసా?

బతుకమ్మ పండుగను ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా తెలంగాణా ప్రభుత్వం జరుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే..ఈ పండుగను అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి సెలబ్రేట్ చేసుకుంటారు.తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ ఆడపడుచులకు ఎంతో ప్రత్యేకమైంది. బతుకమ్మ వేడుకల చివరి రోజను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున గౌరీ దేవికి ఐదు లేదా తొమ్మిది రకాల సద్దులను సమర్పించి వచ్చే ఏడాది త్వరగా రావాలని దేవిని ప్రార్థిస్తారు.నువ్వుల సద్ది బతుకమ్మ కోసం తయారుచేసే సంప్రదాయ, సాధారణ వంటకం. దీన్ని ఎలా తయారుచేసుకోవాలో,కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చుద్దాము..

కావాల్సిన పదార్థాలు:

4 కప్పుుల వండిన అన్నం

½ కప్పు నువ్వులు

½ టీస్పూన్ మెంతి గింజలు

2 టేబుల్ స్పూన్ల ధనియాలు

5 ఎండు మిరపకాయలు

3 టేబుల్ స్పూన్ల వంటనూనె

1 టీస్పూన్ ఆవాలు

1 టీస్పూన్ జీలకర్ర

3 టేబుల్ స్పూన్ల శెనగలు

4 మొత్తం ఎండు మిరపకాయలు

1 కొమ్మ కరివేపాకు ఆకులు

½ టీస్పూన్ పసుపు పొడి

తయారీ విధానం:

 ముందుగా స్టవ్ వెలిగించి నువ్వులు, మెంతి గింజలు, ధనియాలను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ స్టవ్ పై పెట్టుకుని .. అందులో ఒక టీస్పూన్ నూనె పోసి అందులో ఎండు మిరపకాయను చిన్న ముక్కలుగా చేసి వేయించి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ గ్రైండ్ లో వేసి పొడి చేసుకోండి. స్టవ్ పై పాన్ పెట్టి.. వేడెక్కిన తర్వాత నూనె పోసి, జీలకర్ర, ఆవాలు, శనగ పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, వేసి నిమిషం లేదా రెండు నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పాటి ప్లేట్ తీసుకుని వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత వచ్చేంత వరకు ఉంచి.. అందులో నువ్వుల గింజల మసాలా మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలపండి. అంతే.. రుచికరమైన నువ్వుల సద్దీ తయారైనట్టే. పెరుగు లేదా ఫ్రై లతో సర్వ్ చేసేయండి..అంతే ఎంతో రుచికరమైన నైవెద్యం రెడీ..ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవెద్యం..