భారతదేశంలో సాంప్రదాయ పండుగలలో ఒకటి దీపావళి..ఈ పండుగకు పెద్ద చరిత్ర ఉంది..దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపావళి రోజు లక్ష్మీపూజ చేసిన అనంతరం ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సంపదలకు చిహ్నంగా ఈ దీపాన్ని భావిస్తారు..ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా ఈ రోజు చేసే లక్ష్మీపూజ వెనుక ఓ ప్రత్యేకత ఉంది..
దుర్వాస మహర్షి ఒకరోజు దేవేంద్రుని (ఇంద్రుడి) ఆతిథ్యానికి వెళ్లి ఓ హారాన్నిస్తాడు. ఆ హారాన్ని తిరస్కరించిన ఇంద్రుడు తన ఐరావతం మెడలో వేస్తాడు. ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అసలే అప్పుడు ఐరావతము ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ..ఇదంతా చూసి కోపంతో రగిలిపోయిన మహర్షి దేవేంద్రుడిని శపిస్తాడు.
ఆ శాప పలితంగా తన స్థానాన్ని, సర్వసంపదలను కోల్పోతాడు. దిక్కుతోచని స్థితిలో శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తాడు. కరుణిగించిన శ్రీ మహావిష్ణువు…ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు. ఇంద్రుడు అలా చేసిన తర్వాత పోయిన సిరిసింపదలు,శక్తులు తరిగొచ్చాయని పురాణ కథనం. అప్పటి నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికిసర్వసంపదలూ చేకూరతాని విశ్వసిస్తారు.
భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు..తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు.
నరకుడు చతుర్థశి రోజు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి వెలుగుల తో సంబరాలు చేసుకుంటారు..రావణ సంహారం అనంతరం సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు. అందుకే దసరాకి రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు..దసరా అనంతరం వచ్చే పండుగ దీపావళి. రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు..
ఇకపోతే టాపాసులు ఎందుకు కాలుస్తారు.. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. చాలా ప్రాంతాల వారి ప్రధాన ఆహారం…శీతాకాలంలోనే వృద్ధి చెందుతుంది. దీపావళితో శీతాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే పంటను నాశనం చేసే రకరకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ కీటకాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఈ సమస్యకు గంధకం వినియోగం మంచి పరిష్కారం. దీపావళి రోజు బాణసంచా కాల్చడం వల్ల గాలిలో గంధకం పొగ వ్యాపించి కీటకాలను నివారిస్తుందని నమ్మకం..