నవరాత్రుల్లో ఈ పూజ చాలా ప్రత్యేకం!!

నవరాత్రులు అనగానే గుర్తువచ్చేది.. అమ్మవారి నవరాత్రుల్లే. ఈ ఉత్సవాలల్లో ప్రత్యేకంగా శ్రీవిద్యలో చెప్పిన కొన్ని పూజలను చేస్తే శ్రీఘంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పండితులు అనుభవసారంతో చెప్పారు. సులభంగా చేయగలిగే పూజ ఇది. దీని గురించి తెలుసుకుందాం…

నవరాత్రి పూజావిధానాలలో కుమారీ పూజకు చాలా ప్రత్యేకత ఉంది. తొమ్మిది సంవత్సరాలలోపు బాలికను అలంకరించి నూతన వస్రా్తలను ధరింపజేసి, అమ్మస్వరూపంగా భావించి తన్మయత్వం చెందుతూ చేసే పూజను కుమారీ పూజ అంటారు. ఇది సాధకులకు ఎంతో మేలు చేస్తుంది. తొమ్మిది మంది బాలికలను కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక, శాంభవి, దుర్గ, సుభద్ర అని పేర్లతో కుమారీలను ప్రత్యేకంగా పూజిస్తారు. ఆయా రోజుల్లో కుమారీ పూజావిధానాన్ని శాస్త్రంలో చెప్పినట్లు ఆచరిస్తే భక్తులు కోరికలను అమ్మ వెంటనే నెరవేరుస్తుంది.

– కేశవ