సంక్రాతి నాడు ఈ పనులు మాత్రం చెయ్యొద్దు…! ఎందుకంటే…?

సంక్రాతి అంటేనే ప్రత్యేకమైన పండుగ. పైగా తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగలలో సంక్రాంతి పండగ ప్రధానమైనది. ఈ పండగను తెలంగాణలో కంటే ఏపీలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఎంతో సరదాగా కొత్త అల్లుళ్లతో, కోడి పందాలతో, రంగవల్లికలు, పిండివంటలు, భోగి మంటలు ఇలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతిని దేశం లో వేర్వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎవరి ఆనవాయితి ప్రకారం వాళ్ళు ఈ పండుగ రోజు అనుసరిస్తారు. సంక్రాతికి ఎక్కడో ఉండే వాళ్ళు కూడా తమ పల్లెలకు చేరుతారు. పల్లెలోనే సంక్రాంతిని బాగా జరుపుతారు.

ఇది ఇలా ఉంటే హిందూ పురాణాల ప్రకారం కొన్ని పనులు చేయకూడదు. అవి చేస్తే దురదృష్టం వెంటాడుతుంది అని అంటారు. అలానే భవిష్యత్తు కష్టాలమయం అవుతుందని హెచ్చరిస్తున్నారు. మరి ఎటువంటి పనులు చెయ్యకూడదు..?, చేస్తే ఎలాంటి కష్టాలు వస్తాయి..? ఇలా అనేక విషయాలు మీకోసం. మరి మీరు కూడా ఒక లుక్ వేసేయండి. సంక్రాంతి నాడు మాంసం వండ కూడదు. మన తెలుగు వారు ఎలాగూ సంక్రాంతి రోజున మాంసం వండరు. ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. అలానే సంక్రాంతి రోజున వంటల్లో నల్ల నువ్వులు తప్పని సరిగా వేసుకోవాలి గమనించండి.

అలానే సంక్రాంతి రోజున పెద్దవారిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఒకవేళ పెద్దవారిని నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందట. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ వాదనకు దిగకండి. ముఖ్యంగా పెద్ద వారితో సఖ్యతగా మెలగాలి. పండుగ రోజున ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చితే అది ఎంతో పుణ్య ఫలం అని పండితులు చెప్తున్నారు. కనుక వీటిని అనుసరించండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.