చెట్టినాడ్ ఫిష్‌ఫ్రై తయారీ

-

హెల్దీఫుడ్ ఏంటని అడిగితే ఆలోచింకుండా చేపలతో చేసిన వంటకం అని చెప్పవచ్చు. దీనివల్ల పోషకాహారలోపం తగ్గుతుంది. చేపల్లో పోషకపదార్థాలు మాంసకృత్తులు, విటమిన్ ఎ, డి, ఫాస్పరస్ ఇతర ఖనిజములు పుష్కలంగా ఉంటాయి. తరచూ తినడం వల్ల చిన్నపిల్లల్లో అస్తమా నుంచి పెద్దల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వరకూ అన్ని రకాల జబ్బులను నివారించవచ్చు. వాటిలో చెట్టినాడ్ ఫిష్‌ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావాల్సినవి :
చేపముక్కలు : 4
నూనె : సరిపడా
వెల్లుల్లిరెబ్బలు : 7
అల్లంముక్క : చిన్నది
జీలకర్ర : టీస్పూన్
సోంపు : టీస్పూన్
ధనియాలు : 2 టీస్పూన్లు
నల్లమిరియాలు : 2 టీస్పూన్లు
ఆవాలు : అర టీస్పూన్
కరివేపాకు : 2 రెబ్బలు
టమాటా : 1
కారం : టీస్పూన్
పసుపు : 2 టీస్పూన్లు
చింతపండు : చిన్న నిమ్మకాయ పరిమాణం
మొక్కజొన్న పిండి : 1 టేబుల్‌స్పూన్
ఉప్పు : తగినంత.

తయారీ :
చేపముక్కలను ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడగాలి. చింతపండును నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం నూనె వేసి అందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, సోంపు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. కొద్దిగా ఉప్పు, టమాటా ముక్కలు వేయాలి. వేగిన తర్వాత పసుపు, కారం వేసి వేయాలి. ఆ తర్వాత చింతపండు రసం పోయాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలపై పోయాలి. దీనిపైన మొక్కజొన్న పిండి చల్లుకోవాలి. ఇప్పుడు చేపముక్కలను పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్‌లో నూనె వేసి చేపముక్కలను వేయించాలి. ముక్కలను ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని నిమ్మరసం పిండి వేడివేడిగా తింటే రుచికరంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news