పసుపుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు..

-

మన వంటింట్లో పసుపు లేకుండా ఏ ఇల్లు ఉండదు. భారత దేశ ప్రజలు పసుపు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. పసుపుని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లేమేటరీలు శరీరాన్ని రోగాల బారి నుండి కాపాడతాయి. ఇందులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. పసుపుని ఆహారంలో భాగంగా చేసుకుంటే వచ్చే కొన్ని ప్రయోజనాలని తెలుసుకుందాం.

బరువు తగ్గడం

బరువు తగ్గడానికి పసుపు బాగా పనిచేస్తుంది. మీ ఆహారంలో పసుపుని భాగంగా చేసుకుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఐతే దీనికోసం కూరని ఎక్కువగా తినాలి. చాలా మంది అన్నం తిన్నంతగా కూరని తినరు. కానీ కూరని ఎక్కువగా తినడం వల్ల పసుపు శరీరంలోకి వెళ్తుంది.

ఆర్థరైటిస్

పసుపులో ఉండే కర్క్యుమిన్, కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్న వారు పసుపుని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ కాలంలో ఒత్తిడి లేని మనుషులు ఎవరూ లేరు. పసుపు ఒత్తిడిని తగ్గించి ఆలోచించడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మన మూడ్ ని బాగు చేసి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడుతుంది.

బీపీ

అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. హైబీపీతో బాధపడేవారు పసుపు చేసే మేలు గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

మతిమరుపు

మతిమరుపుని పోగొట్టే అద్భుతమైన ఔషధం ఏదైనా ఉందంటే అది పసుపు అని చెప్పవద్దు. వృద్ధాప్యంలో మతిమరుపు చాలా సాధారణమైన సమస్య. దీన్నుండి బయటపడాలంటే పసుపుని ఆహారంలో తీసుకోవాలి. అందుకే పసుపుని ఆహారంలో భాగం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news