పీతల బిర్యానీ ఎలా చేస్తారో తెలుసా..?

కొంతమందికి పీతలంటేనే తెలియదు. వాటిని తింటారా? అని ఆశ్చర్యపోతారు. మరికొంతమంది మాత్రం పీతలను లొట్టలేసుకుంటూ తింటారు. వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వాటిని పులుసు పెట్టుకొని మరీ లాగించేస్తారు. పీతలతో బిర్యానీ కూడా వండుకోవచ్చు. అవును.. మరి.. పీతల బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీదగ్గర బాస్మాతి బియ్యం, పీతలు, కొంచెం నెయ్యి, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, మసాలపొడి, దనియాలు, జీలకర్ర, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కుంకుమపువ్వు, వెన్న.. ఉంటే చాలు మీరు పీతల బిర్యానీని వండొచ్చు.

Do you know how to perform crab biryani

ముందుగా బాస్మాతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. దాంట్లో ఇంత కుంకుమ పువ్వు వేయండి. బాస్మాతి అన్నాన్ని కొంచెం పలుకు ఉండేలా వండి పక్కన పెట్టండి. మీకు పైన చెప్పిన కూరగాయలన్నింటినీ చిన్నచిన్నగా తరిగి పెట్టుకోండి. పీతలను పెద్దవైతే పెద్ద ముక్కలుగానూ కట్ చేసుకోవచ్చే. లేదంటే.. పీతల్లో బొక్కలు తీసేయండి. ఓ గిన్నె తీసుకోండి.. దాంట్లో ఇంత వెన్న వేసి దాన్ని కరిగించి.. దాంట్లో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర, కారం, గసగసాలు ఒకటి తర్వాత ఒకటి వేయండి. వాటిని దోరగా వేయించండి. ఆ తర్వాత పీతల ముక్కలను, ఉప్పును వేయండి. బాగా కలిపి కాసేపు మంట మీద అలాగే ఉంచండి. పీతలు ఉడికాయి అని అనుకున్నాక.. గ్యాస్ కట్టేయండి. మరో పాత్రను తీసుకొని… దాంట్లో ముందే ఉడకబెట్టిన అన్నం, పీతల కూరను లేయర్లుగా ఒకదాని మీద మరోటి పరచండి. దాని మీద కొంచెం నెయ్యి, పూదీన ఆకులతో గార్నిష్ చేసి కాసేపు మంటల మీద పెట్టండి. కొంత సేపటి తర్వాత మంట ఆపేయండి. అంతే.. ఘుమఘుమలాడే పీతల బిర్యానీ రెడీ.