బంగాళదుంపలు ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలని అనుసరించండి..!

ఎక్కువగా వంటల్లో బంగాళదుంపలు ( Potatos ) వాడుతూవుంటాము. బంగాళదుంపతో తయారు చేసే వంటకాలని పిల్లలు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఎక్కువగా బంగాళాదుంపల్ని కొనుగోలు చేస్తే పాడైపోతాయి అని భయపడుతున్నారా..? ఇక నుండి మీకు ఆ చింత లేదు.

ఈ టిప్స్ ని కనుక అనుసరిస్తే బంగాళదుంపలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మరి బంగాళదుంపలు నిల్వ ఉంచే పద్ధతులు గురించి ఇప్పుడు మనం ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం.

ఎక్కువగా గాలి తగిలే ప్రదేశంలో మరియు చల్లటి ప్రదేశాలలో బంగాళాదుంపల్ని ఉంచండి. దీనితో అవి ఎక్కువ కాలం ఉంటాయి.
బంగాళాదుంపల్ని చల్లటి టెంపరేచర్ వుండే ఫ్రిజ్లో పెట్టడం వల్ల బంగాళదుంప రుచి తియ్యగా ఉంటుంది మరియు దానిని వండేటప్పుడు రంగు మారదు.

అదే విధంగా మీరు స్టోర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ సంచులను కానీ పేపర్ బ్యాగ్లను ఉపయోగించండి దీనితో అవి పాడైపోకుండా ఎక్కువకాలం ఉండడానికి వీలవుతుంది.

అలానే మీరు బంగాళాదుంపల్ని స్టోర్ చేసేటప్పుడు కడగకండి. నీళ్లు వలన చల్లగా అయ్యి త్వరగా పాడైపోతాయి.
బంగాళదుంపలు మీద ఆకుపచ్చగా ఉంటే వండేటప్పుడు దానిని తొలగించండి.

అదే విధంగా బంగాళాదుంపల్ని వండేటప్పుడు లేదా తినేటప్పుడు దాని మీద ఉండే మొలకలుని తొలగించండి.
మొలకలు బంగాళదుంపలు మీద వున్నాయంటే ఎదగడానికి సంకేతం. చల్లటి ప్రదేశాలలో చీకటిగా ఉండే ప్రదేశాల్లో వాటిని స్టోర్ చేస్తే మొలకలు రాకుండా ఉంటాయి. కనుక ఈ టిప్స్ ని అనుసరించి బంగాళదుంపలను ఎక్కువకాలం వుండే విధంగా స్టోర్ చేసుకోండి.