Alia Bhatt : ముత్యాల గౌనులో ఆలియా భట్ మెస్మరైజింగ్ ఫొటోలు

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అత్యంత ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొంది. ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెట్ గాలాలో సందడి చేసింది. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, రిలయన్స్ జియో యాజమానురాలు ఈషా అంబానీతో కలిసి మెట్ గాలాలో సందడి చేసింది.

ఆలియా భట్ మెట్ గాలా లుక్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఈ బ్యూటీ వైట్ కలర్ గౌనులో సందడి చేసింది. ఈ గౌను డిజైన్ కు లక్ష ముత్యాలు ఉపయోగించారట. ముత్యాల గౌనులో ఆలియా రెడ్ కార్పెట్ పై నడిచొస్తుంటే.. ఆహా.. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

ఈ ఫొటోలను ఆలియా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆలియా ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ గౌనులో ఆలియా ఏంజిల్ లా ఉందని నెటిజన్లు అంటున్నారు. ఆలియా చాలా అందంగా కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీ ఈ ఔట్ ఫిట్ లో యువరాణిలా కనిపిస్తోందని హార్ట్ ఎమోజీస్ తో తమ ప్రేమ కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news