చీరకట్టులో టిల్లు భామ అనుప‌మ జిగేల్ జిగేల్

-

మళయాల కుట్టీ అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఓ వైపు సిద్దు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తూనే మరో వైపు మాస్ మహా రాజ రవితేజ తో కలిసి ఈగల్సినిమాలో సందడి చేసింది. ఈ సినిమ ఈ నెల 9వ తేదీన థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది.

 

ఈ నేపధ్యంలో అనుపమ ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. వరుస ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఇస్తోంది. వీటి కోసం అదిరిపోయే ఔట్ ఫిట్స్ ధరిస్తుంది. తాజాగా ఈగల్ ఈవెంట్ లో అనుపమ చీరకట్టు లో కన్పించింది. నిండైన చీర కట్టులో ఈ భామ పదహారణాల తెలుగమ్మాయిలా మెరిసిపోయింది.

ఈ ఫోటోలను అనుపమ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన క్షణాల్లోనే ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అనుపమ అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. చీర లో మా అను చాలా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక హార్ట్, ఫైర్ ఏమోజీలతో కామెంట్ బాక్స్ నింపెస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news