Payal Rajput : పార్కులో ఎంజాయ్ చేస్తూ పాయల్ క్యూట్ పోజులు.. ఫిదా అవుతున్న నెటిజన్లు

-

పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ భామ పోస్టు చేసిన ఫొటోలు సూపర్ క్యూట్ గా ఉన్నాయి. ప్రజెంట్ వెకేషన్ లో ఉన్న పాయల్ విదేశీ వీధుల్లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడ ఓ పార్కులో సందడి చేసిన ఈ బ్యూటీ చిన్నపిల్లలా మారిపోయి జాలీగా గడిపింది.

ఈ ఫొటోలను కాస్త తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోల్లో పాయల్ చాలా క్యూట్ గా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు హాట్ అండ్ బోల్డ్ అవతార్ లో కనిపించే ఈ భామ ఈసారి సూపర్ కూల్ గా ఉందంటున్నారు.

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసినా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరిచింది. ఆ తర్వాత ఆర్ డీఎక్స్ లవ్,  వెంకీ మామ వంటి పలు సినిమాల్లో అలరించింది. అందం, అభినయం ఉన్నా ఈ బ్యూటీకి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news