చీరకట్టులో రంగమ్మత్త.. నీ అందానికి కుర్రాళ్లు దాసోహమమ్మా

-

రంగమ్మత్త మరోసారి సోషల్ మీడియాలో తన సొగసుల బాణం విసిరింది. ఈసారి ఈ భామ పట్టుచీరలో కనువిందు చేసింది. చీరకట్టులో అనసూయ కుందనపు బొమ్మలా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పింక్ కలర్ శారీలో అనసూయ చాలా అందంగా కనిపిస్తోంది. నుదుట బొట్టు..మెడలో హారంతో మెస్మరైజింగ్ స్మైల్​తో అనసూయ అందరి మది దోచేస్తోంది.

అనసూయ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ అందం రోజురోజుకు పెరిగిపోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా చీరకట్టులో ఎంత ముద్దుగున్నావమ్మా.. రంగమ్మత్తా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరేమో ఇలా పద్ధతిగా ఉండొచ్చుగా.. రోజూ ఆ పిచ్చి బట్టలేసుకోకపోతే అని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్​లో అనసూయ లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక అనసూయ ఓవైపు బుల్లితెరపై తన సత్తా చాటుతూనే వెండితెరపైనా తన హవా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ విమానం, ఆరి, వుల్ఫ్, పుష్ప2 సినిమాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news