Samantha : దేవకన్యలా సమంత.. దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇవాళ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ అమ్మవారిని సందర్శించి సినిమా ప్రమోషన్స్ షురూ చేసింది. శాకుంతలం టీమ్ తో కలిసి అమ్మవారిని దర్శించుకుంది.

ఇక సమంత ఇవాళ వైట్ కలర్ ఔట్ ఫిట్ లో కనిపించింది. ఈ ఔట్ ఫిట్ లో సామ్ దేవకన్యలా ఉంది. సమంత తాజా ఫొటోలు చూసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తమ ఏంజిల్ ఆరోగ్యంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. సామ్ ఈజ్ బ్యాక్ ఆన్ ఫామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ లతో నెట్టింట సందడి చేస్తున్నారు. వైట్ కలర్ డ్రెస్ లో సామ్ చాలా అందంగా కనిపిస్తుందంటూ పొగిడేస్తున్నారు.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే శాకుంతలం ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత సమంత తెలుగులో ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో సామ్ సరసన విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో సమంత వరుణ్ ధావన్ తో కలిసి సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news