ఇలా సులువుగా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు…!

-

హెర్బల్ టీ వంట శాతం నేచురల్. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగ పడుతుంది. అలానే అరుగుదలకు సహాయ పడుతుంది మరియు బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. మన నిద్రని కూడా ఇది మెరుగు పరుస్తుంది పైగా ఇందులో కెఫిన్ ఉండదు. షుగర్ లెవెల్స్ ను మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ రోజు మనం కొన్ని హెర్బల్ టీల గురించి చూద్దాం..!

తులసి టీ:

తులసి టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో థెరప్యూటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. స్కిన్, డెంటల్ సమస్యలు తొలగించడానికి బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. జ్వరం, జలుబు, అజీర్తి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది.

చమోమిలే టీ:

చమోమిలే టీ తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీని చమోమిలే టీ పెంచుతుంది. పైగా కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది.

పసుపు పాలు:

అలాగే పసుపు వల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయి. కొద్దిగా పాలల్లో పసుపు వేసుకొని తీసుకోవడం వల్ల కూడా మీరు ఇమ్మ్యూనిటీని పెంచుకోవచ్చు. కాబట్టి కొద్దిగా పాలు తీసుకుని దానిలో చిటికెడు పసుపు వేసి తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news