మన భారతీయ పచ్చళ్ళని డైట్ లో తీసుకుంటే కలిగే లాభాలు తెలుసా..?

-

సాధారణంగా మనం ఊరగాయలు పెట్టుకుంటాము. నిజంగా చూడగానే నోరూరిపోతూ ఉంటుంది. వేడి వేడి అన్నం లో కొద్దిగా పచ్చడి వేసి కలుపుకుని తింటే ఆ రుచి మరెక్కడ మనకి దొరకదు. వీటిలో మనం చాలా రకాలు తయారు చేసుకోవచ్చు.

ఆవకాయ, మాగాయ, గోంగూర మొదలైనవి ఎన్నో మనం చేసుకుంటూనే ఉంటాం. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే వీటి వల్ల చాలా బెనిఫిట్స్ కలుగుతాయి. అయితే ప్రతి రోజూ వీటిని మనం డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం..!

ఇమ్యూనిటీని పెంచుతుంది:

పచ్చళ్లు తయారు చేసుకునే టప్పుడు పసుపుని అందులో వేస్తూ ఉంటారు. పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది బాక్టీరియా మరియు వైరస్ ని దరిచేరకుండా ఉంచుతుంది. అలానే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

విటమిన్స్ మరియు మినిరల్స్:

కొత్తిమీర, కరివేపాకు పుదీనా మొదలైన ఆకుకూరలతో పచ్చడి పెట్టుకోవడం వల్ల విటమిన్స్ మరియు మినిరల్స్ అందుతాయి. ఆకుకూరలతో చేసిన ఊరగాయ లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె మరియు ఐరన్, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి. వీటిని చేర్చుకోవడం వల్ల సులువుగా విటమిన్స్ మరియు మినిరల్స్ అందుతాయి.

ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది:

ఊరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ని తొలగించడానికి ఉపయోగపడతాయి. జీర్ణ సమస్యలను కూడ తొలగిస్తుంది. డైట్ లో ఈ పచ్చళ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను వుండవు.

Read more RELATED
Recommended to you

Latest news