పసిపిల్లలకు డబ్బాపాలు ఇస్తున్నారా..? భవిష్యత్తులో ఈ సమస్య ఎదుర్కోక తప్పదు

-

మారుతున్న కాలంతో పాటు.. పిల్లలను పెంచే విధానం కూడా మారుతుంది. ఒకప్పుడు పసిబిడ్డలకు తల్లిపాలు ఇచ్చేవాళ్లు. కానీ నేడు ఎక్కడ చూసిన ఒక డబ్బాలో పాలు పోసి.. వాడి మొఖాన కొడతారు. ఇక పిల్లలు నోట్లో ఎప్పుడూ ఆ డబ్బా ఉంటుంది. ఏడిస్తే చాలు.. తెచ్చి నోట్లో పెడతారు. తల్లిపాలే శిశువుకు ఆరోగ్యాన్ని పెంచుతాయి. చిన్నప్పుడు ఎక్కువకాలం పాటు.. తల్లిపాలు తాగి పెరిగిన వారికి, డబ్బా పాలు తాగి పెరిగిన వారికి భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై చాలా తేడాలు ఉంటాయి. ఈరోజు మనం డబ్బాపాలు ఆరోగ్యానికి ఏ విధంగా చెడు చేస్తాయి, తల్లిపాలు వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

డబ్బాపాల వల్ల నష్టాలు:

డబ్బాపాలల్లో ఇమ్యునోగ్లోబులిన్స్ ఉండవు. రక్షణ వ్యవస్థకను పెంచడానికి ఇవి చాలా అవసరం.

అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్ బిడ్డకు అవసరం.. ఇవి కూడా డబ్బాపాలల్లో ఉండవు..

డబ్బా పాల్లలో ఆర్టిఫీషియల్ ఫ్యాట్స్ కలుపుతారు. దీనివల్ల పిల్లలు ఊరికే బరువు పెరుగుతారు. దీనివల్ల కొవ్వుకణాల సైజు పెరిగిపోతుంది. బిడ్డకు మొదట రెండేళ్ల పాటు డబ్బా పాలు ఇస్తే.. ఇక లైప్ అంతా.. ఆ కొవ్వుకణాల సైజ్ ఎక్కువగానే ఉంటుంది. ఇది ఒబిసీటీకి దారితీస్తుంది.

డబ్బాపాలు తాగే పిల్లలకు జీర్ణక్రియ సరిగ్గా ఉండదు. అందుకే ఊరికే వాంతులు, మోషన్స్ అవుతుంటాయి.

డబ్బా పాలు తాగే పిల్లల ప్రేగుల్లో మంచి బాక్టీరియా ఫామ్ అవదు. ఇది రక్షణ వ్యవస్థకు మంచిది కాదు.

చూడ్డానికి డబ్బాపాలు తాగే పిల్లలు బాగుంటారు కానీ.. లోపల ఆరోగ్యం ఏమాత్రం బాగుండదు.

తల్లిపాల వల్ల ప్రయోజనాలు

తల్లిపాలల్లో 3-5 గ్రాముల వరకూ కొవ్వు ఉంటుంది.
1 గ్రాము ప్రోటీన్ ఉంటుంది.
65-70 కాలరీల శక్తి ఉంటుంది.
87శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది.

తల్లిశరీరం నుంచి తీసే పాలు బిడ్డకు మ్యాచ్ అవుతాయి కాబట్టి.. తల్లిపాలు తాగే పిల్లలకు వాంతులు, మోషన్స్ ఎక్కువ రావు. తల్లిపాలు తాగేప్పుడు.. ఆ తల్లికి ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల పాలు ఎక్కువ వస్తాయి, గర్భాశయం కూడా సాగిందంతా నార్మల్ స్టేజ్ కు వస్తుంది, యోనిమార్గం వెడల్పు అయిందల్లా నార్మల్ స్టేజ్ కు వస్తుంది.

తల్లిపాలు తాగే పిల్లల్లో కొవ్వుకణాలు పెద్దివిగా ఉండవు. లైఫ్ అంతా సన్నగా గట్టిగా ఉంటారు. రక్షణ వ్యవస్థకు కావాల్సిన అన్నీ బాడీకీ అందుతాయి.

పుట్టినప్పుడు తప్ప మరే దశలో తల్లిపాలు తాగలేరు. మరి అప్పుడు కూడా మీరు డబ్బా పాలు ఇస్తే ఎలా అండీ..!

పాలు ఉత్పత్తి కానీ తల్లులు ఏం చేయాలి..?

తల్లిపాల తర్వాత అంత శ్రేష్ఠంకాకమైన.. ఇక చేసేదేమి లేని పరిస్థితుల్లో ఆవుపాలు ఇవ్వొచ్చు. గేదేపాల్లలో బిడ్డకు కావాల్సిన పోషకాలు అందవు. నాటు ఆవుపాలు తీసుకొచ్చి బిడ్డకు అందించవచ్చు.

ప్రెగ్నేస్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచే ప్రతిస్త్రీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే.. బిడ్డపుట్టాక పాలు ఉత్పత్తి అవడం లేదనే సమస్య ఉండదు. బిడ్డకు తల్లిపాలను మించి శ్రేష్టమైన ఆహారం మరేది ఉండదు. చిన్నతనంలో బిడ్డకు అందించే ఆహారమే వారి జీవితాంతం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పసిపిల్లలకు డబ్బాపాలు ఇవ్వొద్దంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version