ఎలాంటి పర్‌ఫ్యూమ్‌ కొంటున్నారు?

-

పర్‌ఫ్యూమ్‌ అంటే చెమట వాసనను అధిగమించడానికి మాత్రమే అనుకుంటున్నారా? అయితే పొరబడినట్లే. పర్‌ఫ్యూమ్‌ సువాసనకే కాదు వ్యక్తిత్వాన్ని, హూందాతన్ని ప్రతిబింబిస్తుంది. వేలు పెట్టి కొన్నా వాసన కొన్ని గంటల్లో పోయేదే కదా అనుకుంటారు. ఆ కొద్ది సమయంలోనే మీరు ఎదుటివారి మనసులో నిలిచిపోవాలంటే ఈ పర్‌ఫ్యూమ్‌లు కొనాల్సిందే!

– పర్‌ఫ్యూమ్‌ కొనే ముందు.. బాటిల్‌పై టాప్‌, బాటమ్‌, మిడిల్‌ అనే మూడు ఇన్‌స్ట్రక్షన్లు ఉన్నాయో లేదో చూడండి. టాప్‌.. అంటే స్ప్రే చేసిన 15 నిమిషాల తర్వాత సువాసన వస్తుంది. కొంచెం సేపు ఉండి సువాసన రాకుండా ఉంటుంది.
– మిడిల్‌ నోట్‌.. ఇది కొన్ని గంటల వరకు ఉంటుంది. పర్‌ఫ్యూమ్‌ కొట్టినప్పటి నుంచి గంటలు తరబడి అంటే కనీసం ఆరు గంటల వరకు పనిచేస్తుందని చెప్పవచ్చు. ఆ తర్వాత అంతగా వాసన ఉండదు.
– బాటమ్‌ నోట్‌.. ఇదైతే.. రోజంతా సువాసనను వెదజల్లుతుంది. కాబట్టి పర్‌ఫ్యూమ్‌ కొనేముందు ఈ మూడు అంశాలను చూసి కొనుగోలు చేయాలి.

– మొదటిసారి పర్‌ఫ్యూమ్‌ను వాడే వారు తేలికపాటి సువాసనలు ఉండేట్లు ప్రయత్నిస్తే మంచిది. మస్కీ, కలప వంటి పర్‌ఫ్యూమ్‌లు తేలికైన సువాసనల్ని వెదజల్లుతాయి.
– అన్ని పర్‌ఫ్యూమ్‌లను ఒకేసారి ప్రయత్నించవద్దు. సువాసనలను పరీక్షించడంలో అస్సలు తొందర పడొద్దు. వాసన ఎక్కువగా పీల్చడం వల్ల మంచి వాసనలను పసిగట్టలేరు. అందుకని రెండుమూడు పర్‌ఫ్యూమ్‌ల కంటే ఎక్కువగా ప్రయత్నించకూడదు.
– పర్‌ఫెక్ట్‌ పర్‌ఫ్యూమ్‌ పరీక్షించడానికి ఉత్తమ మార్గం చేతి మణికట్లు భాగం. అంతేకాదు చెవుల వెనుక, గొంతు వద్ద, మోచేతుల వెనుక భాగంలో ఎక్కడైనా స్పే చేసి వాసన పీల్చవచ్చు. ఈ భాగాలే సువాసనను తీవ్రతరం చేసేందుకు సాయపడుతాయి.
– ఇంకెందుకు ఆలస్యం పర్‌ఫ్యూమ్‌ కొనేముందు మోసపోకుండా వాసన టెస్ట్‌ చేసి కొనుగోలు చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version