నేలఉసిరితో నరాల సమస్యకు పరిష్కారం.. వైరస్ నుంచి రక్షించడంలోనూ బాగా పనిచేస్తుందట..!

-

ప్రకృతిలో అనేకరకాల ఔషధాలు ఉన్నాయి. అవి మన కంటికి కనిపించినా.. అందులో ఉండే ప్రత్యేక విలువలు మనకు తెలియవు. మీ అందరికి నేల ఉసిరి తెలిసే ఉంటుంది. ఊర్లల్లో చాలామంది ఇళ్లలో ఈ చెట్టు ఉంటుంది. ఒక్క చెట్టుకే ఎన్నో ఉసిరికాయలు వస్తాయి..చిన్నచిన్న ఈ ఉసిరికాయలంటే..భలే ఇష్టం కదా..చిన్నప్పుడు బాగా తినే ఉంటారు. ఈరోజు ఈ నేలఉసిరి వల్ల ఆరోగ్యానికి ఏ విధంగా మేలు జరుగుతుందో చూద్దాం. ఏదో టైం పాస్ కి మాత్రమే తినే ఉసిరి అనుకుంటాం..కానీ ఇందులో చాలా లాభాలు ఉన్నాయని మన బుుషులు తెలుసుకున్నారు. సైంటిస్టులు పరిశోధనలు చేసి నిరూపించారు.

నేలఉసిరిలో సుమారుగా 40 రకాలకు పైగా వచ్చే ఇన్ఫ్లమేషన్స్ ను తగ్గించానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు నిరూపించారు. వైరస్ ఇన్ ఫెక్షన్స్ మనకు సోకినప్పుడు అవి నరలా వ్యవస్థను కూడా ఇబ్బందిపెడతాయి. నరాల కణాలు ఒకసారి డామేజ్ అయితే అవి తిరిగి నార్మల్ కావు. వైరస్ క్రిములు నరాలను పాడుచేయటం స్టాట్ చేసినప్పుడు..నరాలు రిపేర్ అవడానికి పైన మైలిన్ షీట్ డామేజ్ అవుతుంది. సంకేతాలు అన్నీ భాగాలు వెళ్లటం తగ్గిపోతుంది. దురదలు వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల పాడైపోయిన నరాలును కూడా తిరిగి నార్మల్ స్టేజ్ తు తీసుకురాగులుగుతుందని 2006వ సంతవత్సరంలో యూనివర్శిటీ ఆఫ్ పుత్రా మలేషియా( University Of Putra Malaysia)వారు నిరూపించారు. వీళ్లు అధ్యయనంలో ఏం చెప్పారంటే..

నేలఉసిరిలో మూడు రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉన్నట్లు గుర్తించారు. ర్యూటిన్( Rutin), క్వర్సటిన్ ( Quercetin), రుట్యునోస్( rutinos) ఈ మూడు యాంటి ఇన్ఫ్లమెంటరీ ప్రొపర్టీనీ బాగా కలిగి ఉన్నాయట. నరాల వ్యవస్థకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. నరాల సమస్యలు వచ్చినవారు..పూర్తిగా కోలుకోవడం పెద్దగా కనిపించదు. కానీ..నేలఉసిరి ఎక్కువమార్పులు తీసుకువచ్చి..సాధరణ స్థితికి రావడానికి అవకాశం కలిగిస్తుందని పరిశోధనలో తేలింది.

వైరస్ వల్ల మనం అంతా వ్యాక్సిన్ వేయించుకున్నాం..కరోనా సోకి తగ్గిన వారికి కూడా శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. యాంటీబాడీస్ తయారుచేసే కణజాలన్ని బీసెల్స్( B-cells) అంటారు. నేలఉసిరి బీసెల్స్ ను యాక్టివేట్ చేసి..ఎక్కువ మొత్తంలో యాంటిబాడీస్ ఉత్పత్తిచేసేట్లు చేస్తుందట.

వైరస్ ను మింగేసే వాటిని మాక్రోపేస్ కణాలు అంటారు..వీటిసంఖ్య విపరీతంగా పెరిగేటట్లు నేలఉసిరి చేస్తుందట. ఇవి శరీరంలో ఎంత ఎక్కువగా ఉంటే..ఇన్ఫెక్షన్ అంత త్వరగా నశిస్తాయి.

నేలఉసిరి వల్ల పొట్టలో అల్సర్లు కూడా త్వరగా మానుతున్నాయని సైంటిస్టులు తెలిపారు. అల్సర్ ఉండే ఏరియాలో ఆ పొర త్వరగా డవలప్ అయ్యేట్లు నేరఉసిరి చేస్తుంది.

కిడ్నీలు రాళ్లను కరిగించడానికి నేలఉసిరి పనిచేస్తుంది..ఈ విషయంపై ఒకప్పుడు బాగా ప్రచరం కూడా జరిగింది. చాలామందికి తెలిసే ఉంటుంది. ఎలా కరిగిస్తుందంటే..నేలఉసిరిలో ఉన్న యాస్ట్రాగలిన్( Astragalin) అనే కెమికల్ కాంపౌండ్ ఉండటం వల్ల కిడ్నీలు స్టోన్స్ స్పీడ్ గా కరుగుతున్నాయని సైంటిఫిక్ గా నిరూపించారు.

ఇన్నిలాభాలు కలిగిస్తుంది కాబట్టి..దొరికినప్పుడల్లా తినండి..పల్లెటూర్లలో అయితే..ఇవి చెట్లు ఉన్నవారు ఫ్రీగా ఇస్తారు. మీ ఇంట్లో చెట్లు ఉంటే..నేలఉసిరి ఆకులు తెచ్చుకుని..క్లీన్ చేసి..పేస్ట్ లా చేసుకుని..తేనెకలిపి గోళీలు చేసుకుని తినేయొచ్చు. నేలఉసిరి పొడి అమ్ముతారు. కాఫీలాగా మరిగించి..తేనె కలుపుకుని తాగేయొచ్చు. ఆకును మరిగించి కషాయం లాగా కూడా తాగేస్తుంటారు. ఇలా ఏ రూపంలో వాడినా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా నరాలు బలాన్ని పెంచుకోవడానికి, నరలా డామేజ్ ను తగ్గించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తంది, ఇంకా ఈ వైరస్ రోజుల్లో శరీరానికి యాంటీబాడీస్ చాలా అవసరం కాబట్టి చిన్నాపెద్దా అని తేడాలేకుండా అందరూ వీటిని ఉపయోగించుకోవచ్చని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version