ఈ విధంగా భోజనం చేసిన తర్వాత తమలపాకును తినడం వలన ఎన్నో ఉపయోగాలను పొందవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండు తమలపాకులను నమలడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. చాలా శాతం మంది తమలపాకుతో పాటుగా వక్క, సున్నం వంటివి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే కేవలం తమలపాకు తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దాంతో చెడు బ్యాక్టీరియాతో పోరాడడానికి సహాయం చేస్తుంది.
అదేవిధంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తమలపాకును తరచుగా తీసుకోవడం వలన ఎన్నో ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండవచ్చు. తమలపాకును భోజనం తర్వాత తీసుకోవడం వలన ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి మొదలైన సమస్యలను తగ్గించుకోవచ్చు దీంతో జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా తమలపాకు లో ఉండే గుణాలు శరీరంలో ఉండే వ్యర్ధాలను తొలగించడానికి సహాయం చేస్తాయి. దీంతో కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది మరియు పూర్తి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత రెండు తమలపాకులను నమలడం వలన మానసిక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా తమలపాకులను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వలన నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. దీంతో ఒత్తిడి వంటి మానసిక సమస్యలు తొలగిపోతాయి. పైగా డోపమైన్, సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్ లు ఉత్పత్తి అవుతాయి. దీంతో ఎంతో ఆనందంగా జీవించవచ్చు. అదేవిధంగా తమలపాకులను తీసుకోవడం వలన డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. వీటిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. కనుక ప్రతిరోజు తమలపాకులను తప్పకుండా భోజనం తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.