అంతే రోజు ఒక గుడ్డు.. ఎక్కువ వద్దు.. తక్కువ వద్దు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్లకు, వచ్చే అవకాశం ఉన్నవాళ్లు రోజూ ఓ గుడ్డును తింటే దాన్ని తగ్గించుకునే అవకాశం ఉందట. ఎలాగూ గుడ్డు ఆరోగ్యానికి మంచిదే అని తెలుసు కదా. కాకపోతే.. వారానికి ఒకటి.. రెండు కాదు.. రోజూ ఒకటి ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలట. అది కూడా ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవాలి. ఆమ్లెటు, గుడ్డుతో వండిన కూర కాకుండా.. సరిగ్గా ఉడకబెట్టిన గుడ్డును తీసుకోవాలి. క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని తప్పించుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. గుడ్లు.. రక్తంలోని ఎమినో యాసిడ్ల స్థాయిని తగ్గిస్తాయట. ఎమినో యాసిడ్లను తగ్గిస్తే.. ఆటోమెటిక్‌గా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.