షుగర్ పేషెంట్స్ గుమ్మడికాయ తినేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోండి..

-

షుగర్ పేషెంట్స్ కు ఏది తినాలన్నా.. కాస్త భయంగానే ఉంటుంది. ఇది తినొచ్చో లేదో.. తింటే షుగర్ పెరిగిందేమో అనే ఆందోళన జీవితాంతం వెంటాడుతుంది. ఏ ఆహారంలో అయితే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో అవి షుగర్ పేషెంట్స్ కు మంచివి. మరి అలాంటి వాటిలో ఎన్నో ఉన్నాయి. మీ అందరికి గుమ్మడికాయ తెలిసే ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధి గ్రస్తులు తినొచ్చు అని కొందరు.. తినకూడదు అని మరికొందరు అంటారు. అసలు గుమ్మడికాయ డయబెటిక్ పేషెంట్స్ తినొచ్చా లేదా అనేది చూద్దాం.

గుమ్మడికాయలో పాలిసాకరైడ్లు, ఖనిజాలు, కెరోటిన్, విటమిన్లతో పాటుగా అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడికాయలో ఉండే పాలిసాకరైడ్లు డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, ఆక్సీకరణ ఒత్తిడి వంటి వ్యాధులను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. గ్లోగోజ్ స్థాయిని తగ్గిస్తాయి.

పరిశోధన ఎలా చేశారంటే..

డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక పరిశోధనలో ఆల్కలాయిడ్ త్రికోణెలైన్ , నికోటినిక్ ఆమ్లం ఉండటం వలన గుమ్మడికాయ మిథనాల్ సారం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్లు సైంటిస్టులు గుర్తించారు. గుమ్మడికాయ తినిపించిన ఎలుకల్లో తొలి 15 నిమిషాల సమయంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుదల కనిపించగా, గంట తరువాత రక్తంలో గ్లూకోజ్ క్రమంగా తగ్గుటాన్ని గమనించారు. గుమ్మడికాయలో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో ఇన్సులిన్ ను ఉత్తేజపరచడం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ సి చక్కగా పనిచేస్తుంది.

గుమ్మడి విత్తనాలు కూడా మంచివే..

గుమ్మడికాయ విత్తన నూనెలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉన్నాయి. అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా లభిస్తాయి. ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడం ద్వారా శరీరంలో నైట్రిక్ ఆమ్లాన్ని పెంచుతుంది. డయాబెటిస్‌ను నివారించడానికి, డయాబెటిస్‌లో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి… గుమ్మడికాయతోపాటు అందులో ఉండే విత్తనాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. పోషకాలతో నిండి ఉన్న గుమ్మడికాయ డయాబెటిస్‌కు మంచిది.. డైలీ నానపెట్టుకుని తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

అనుమానాలు ఎందుకు.?

గుమ్మడికాయ గ్లెసిమిక్ ఇండెక్స్ లో 75 వద్ద అధిక స్ధానంలో ఉంది. అయితే గ్లెసెమిక్ లోడ్ లో మాత్రం 3 వద్ద తక్కువగా ఉంది. అధిక గ్లెసిమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల గుమ్మడికాయ మధుమేహులకు మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు. అయితే గ్లెసిమిక్ లోడ్ తక్కువగా కలిగి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్ధాయిలను పెంచదని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక మొత్తంలో గుమ్మడికాయను తీసుకోవటం మాత్రం మధుమేహ రోగులకు హానికరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version