ఎసిడిటీ సమస్యని ఇలా తొలగించండి..!

-

చాలా మంది ఎసిడిటీ ( Acidity ) సమస్యతో బాధ పడుతూ ఉంటారు. దీని వల్ల ఛాతి ప్రాంతంలో మండుతున్నటు ఉంటుంది. మీరు కూడా ఎసిడిటీతో బాధ పడుతున్నారా..? అయితే తప్పకుండా ఈ పద్ధతులు పాటించి తగ్గించుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే మరి ఇక ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

 

acidity | ఎసిడిటీ
acidity | ఎసిడిటీ

వీటిని అస్సలు తీసుకో వద్దు:

బాగా కారంగా ఉండే పదార్థాలు
ఫ్రై చేసిన ఆహార పదార్ధాలు మరియు ఫాస్ట్ ఫుడ్స్
బాగా ఎక్కువగా తినడం
పుల్లగా ఉండే పండ్లు తినడం
ఎక్కువ సేపు ఆకలితో ఉండడం

వీటిని ఫాలో అవ్వండి:

మీల్స్ ని స్కిప్ చెయ్యద్దు
త్వరగా డిన్నర్ తినేయండి
ఎక్కువ వెల్లుల్లి, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ఉండే ఆహారపదార్థాలు తీసుకోద్దు
స్మోకింగ్ కి దూరంగా ఉండండి
ఆల్కహాల్, టీ, కాఫీని తీసుకోకండి
ఒత్తిడి లేకుండా ఉండండి

మీకు ఎసిడిటి ఉంటే కచ్చితంగా ఈ ఇంటి చిట్కాలు పాటించండి:

కొబ్బరి నీళ్లు తాగండి.
నానబెట్టిన ఎండు ద్రాక్షని ఖాళీకడుపుతో తినండి.
రాత్రి నిద్ర పోయేటప్పుడు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో ఒక టీ స్పూన్ అవు నెయ్యి వేసుకుని తీసుకోండి.
రోజ్ వాటర్ లో పుదీనా ఆకులు వేసుకుని తాగితే జీర్ణ సమస్యలు ఉండవు.
ఉసిరి, శతావరి కూడా బాగా పనిచేస్తుంది.
అలోవెరా జ్యూస్ కూడా ఈ సమస్యని తొలగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news