స్మోకింగ్ ని మానేయలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి!

-

సిగరెట్లు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం అని తెలుసినా సరే చాలా శాతం మంది వాటిని వదలరు. ఎప్పుడైతే సిగరెట్లు వ్యసనంగా మారుతాయో వాటిని పూర్తిగా మానేయడం చాలా కష్టం. కానీ ఆరోగ్యం కోసం కూడా ఆలోచించి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ఎప్పుడైతే స్మోకింగ్ కు బానిసలుగా అవుతారో ఎన్నో శారీరిక మరియు మానసిక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. దీంతో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రోజురోజుకు స్మోకింగ్ కు బానిసలుగా అయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. పైగా సిగరెట్లను తగ్గించడం అసాధ్యం అని అందరూ భావిస్తున్నారు. కాకపోతే కొన్ని చిట్కాలను ఉపయోగిస్తే ధూమపానాన్ని తగ్గించవచ్చు.

ధూమపానానికి సంబంధించి అవగాహనను పెంచడానికి నో స్మోకింగ్ డే ను ప్రతి సంవత్సరం మార్చి రెండవ బుధవారం నాడున నిర్వహించుతారు. ఈ విధంగా ధూమపానం మానడం గురించి కొన్ని మార్గాలను కూడా చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే స్మోకింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారో ఒంటరిగా ఉండడం మానేయాలి. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో, స్నేహలతో కలిసి మాట్లాడుతూ ఉండాలి. ఈ విధంగా తోటి వారి సహాయాన్ని తీసుకుని సిగరెట్లను వదిలేయండి. ఎప్పుడైతే శరీరానికి తగినంత నీరుని అందిస్తారో స్మోకింగ్ గురించి ఆలోచించరు.

అదేవిధంగా మంచినీరును ఎక్కువగా తీసుకోవడం వలన పొట్ట ఎప్పుడు నిండుగా ఉంటుంది. దీంతో ధూమపానం చేయాలి అనే ఆలోచన కూడా ఉండదు. సిగరెట్ ఎక్కువగా అలవాటు అయినప్పుడు చర్మ ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది. అలాంటప్పుడు అల్పాహారంలో భాగంగా బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. దీంతో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పైగా ఇవి తీసుకుంటే సిగరెట్ తీసుకోవాలి అనే కోరిక కూడా తగ్గుతుంది. వీటితో పాటుగా పంచదార లేకుండా తయారు చేసిన స్వీట్లు, సోంపు, క్యారెట్లు తీసుకుంటే సిగరెట్ తాగాలనే కోరిక ఉండదు. కనుక ఇటువంటి చిట్కాలను పాటించి ధూమపానం కు దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version