హ్యాంగోవర్ తర్వాత చర్మానికి వచ్చే సమస్యలను దూరం చేసుకోండిలా..

-

ఆల్కహాల్ తాగే అలవాటున్న వారు చర్మం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పార్టీలో ఫుల్ గా తాగి, తెల్లారి పదయ్యే వరకు లేవకుండా అనేక చర్మ సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ముఖ్యంగా మద్యం తాగడం వల్ల డీ హైడ్రేషన్ అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. మన ఆరోగ్యానికి ఆయువు పట్టు అయిన నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. నీరు శాతం తగ్గడం వల్లనే చర్మం పొడిబారడం, మొటిమలు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే, నీళ్ళు బాగా తాగాలి.

రాత్రి తాగి తెల్లారి లేచి నీళ్ళు సరిగ్గా తాగాలి. సాధారణంగా కంటే ఎక్కువ పాళ్ళల్లో నీరు తీసుకోవాలి. అంతేకాదు నీటిలో దోసకాయ, పుదీన కలుపుకుని తాగితే మరీ బాగుంటుంది.

కాఫీ ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా, ఆల్కహాల్ తీసుకున్న తెల్లారి కాఫీ తాగితే హ్యాంగోవర్ అవకుండా ఉంటుంది. కళ్ళు ఉబ్బడం వంటి సమస్యలు కాఫీ తాగడం వల్ల తగ్గిపోతాయి.

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం కొత్త చర్మ కణాల ఉత్పత్తి జరగదు. అందుకే ఆల్కహాల్ తక్కువగా సేవించాలి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల Dehydration కలుగుతుంది. అందుకే ఉప్పు తక్కువగా తీసుకోండి. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటే శరీరానికి కావాల్సిన నీరు అందడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హ్యాంగోవర్ కారణంగా వచ్చే సమస్యలను దూరం చేసుకుని చర్మాని సురక్షితంగా ఉంచుకోవడానికి పైన చెప్పిన పాయింట్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఈ మేరకు పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news