మొలకెత్తిన గింజలు, విత్తనాలు తినండి.. ఆరోగ్యంగా ఉండండి అని అందరూ చెప్తారు.. డైట్‌లో ఉన్నవాళ్లు రెగ్యులర్‌గా ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు తింటారు. వీటివల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాడికి సరిపడా ఫైబర్ అందుతుంది, వెయిట్ లాస్ అవ్వొచ్చు.. ఇలా చాలా ఉన్నాయి. అయితే పాపం చాలామందికి వీటిని తినాలన్నా.. అవి ఎలా మొలకలు వచ్చేలా చేయాలో తెలియక బయట షాపుల్లో తెచ్చుకోవడం లేదా లైట్ తీసుకోవడం చేస్తుంటారు. ఏ ఏ గింజలను ఎంతెంత సేపు నానపెట్టాలో తెలిస్తే.. చాలు. మొలకలు ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ ఒకేసారి ఒకేటైమ్ వరకు నానపెడితే.. కొన్ని గింజలు మొలకలు రావు, కొన్ని వచ్చేసి పాడేపోతాయి. ఏయే గింజలు, విత్తనాలను ఎంత సేపు నానబెట్టాల్సి ఉంటుంది ? అవి మొలకలు వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది ? అనే వివరాలను చూద్దాం.
- బ్రొకొలి విత్తనాలను 8 గంటల పాటు నానబెట్టాలి. అవి 3 నుంచి 6 రోజుల్లో మొలకలు వస్తాయి.
- శనగలను 12 గంటల పాటు నానబెట్టాలి. 12 గంటల్లో మొలకలు వస్తాయి.
- గుమ్మడికాయ విత్తనాలు అయితే 8 గంటల పాటు నానబెడితే 1 రోజులో మొలకలు వస్తాయి.
- క్వినోవా గింజలను 2 గంటల పాటు నానబెడితే చాలు. 1 రోజులో మొలకెత్తుతాయి.
- నువ్వులను 8 గంటలు నానబెట్టాలి. 1-2 రోజుల్లో మొలకలు వస్తాయి.
- పొద్దు తిరుగుడు విత్తనాలను 2 గంటలు నానబెట్టాలి. 2-3 రోజుల్లో మొలకలు వస్తాయి.
- పెసలను 8 గంటల పాటు నానబెడితే 12 గంటల్లోగా మొలకలు వస్తాయి.
- పల్లీలను 12 గంటల పాటు నానబెడితే మరో 12 నుంచి 14 గంటల్లోగా మొలకలు వస్తాయి.
- బాదంపప్పును 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టవచ్చు. అవి మొలకలు వచ్చేందుకు సుమారుగా 12 గంటల సమయం పడుతుంది..
- బార్లీ గింజలు అయితే 6 నుంచి 8 గంటల్లో నానుతాయి. అవి మొలకెత్తేందుకు మాత్రం 2 రోజుల సమయం పడుతుందట.
గింజలు లేదా విత్తనాలను బాగా నానబెట్టాక వాటిని తీసి శుభ్రమైన వస్త్రంలో చుట్టి ఉంచాలి. దీంతో నిర్ణీత సమయంలోగా మొలకలు వస్తాయి. అయితే కొన్నిసార్లు మొలకలు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు వేచి చూడాలి. లేదా తరువాత మళ్లీ వాటిని నానబెట్టేటప్పుడు కాస్తంత ఎక్కువ సమయం ఉంచాలి. దీంతో మొలకలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మొలకలు వచ్చేలా చేయడం సులభం..కానీ సరిగ్గా టైమింగ్స్, ప్రాసెస్ తెలియకపోతే.. ఈ పని అంత ఇరిటేట్ వర్క్ ఇంకోటి ఉండదు అనిపిస్తుంది. సో..పైన చెప్పిన టైమింగ్స్ ప్రకారం..మీరు తినాలనుకునే వాటిని ప్లాన్ చేసుకోండి.!
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.