గోళ్లు కొరకడం వలన ఎన్ని సమస్యలంటే…?

Join Our Community
follow manalokam on social media

గోళ్లను కొరికి, నమలడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. గోళ్ళను కోరడం వాటిని తిరిగి నమలడం చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి గోళ్లను కొరకద్దు అని తల్లిదండ్రులు చెప్పినా వినరు. అయితే తెలియని విషయం ఏమిటంటే ఈ గోళ్లను కొరికి తిరిగి నమలడం వల్ల అనేక జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది దారి తీస్తుందట. చాలా మంది గోళ్ళు కొరకడం తిరిగి వాటిని నమలడం చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మంది గోళ్లను కొరికి, నములుతారట. అయితే అది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం..!

చర్మ సమస్యలు:

గోళ్లను కొరకడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఎర్రగా అయిపోవడం, వాపులు రావడం మొదలైనవి వస్తాయి. అలానే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా చీము మరియు ఎక్కువగా నొప్పి రావడం కూడా జరుగుతాయి.

గోళ్ళ మీద ప్రభావం చూపడం:

ప్రతి రోజు మీకు ఈ అలవాటు ఉంటే మీ గోళ్ళని అది పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. పళ్ళకి నష్టం కలుగుతుంది. అలానే గోళ్ళని కొరకడం కారణంగా పళ్ళను కూడా పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. పళ్ళు ఊడిపోవడం లాంటివి కూడా దీని కారణంగా సంభవిస్తాయి. అంతే కాదండి తరచు కొరకడం వల్ల వంగి పోతాయి.

దంతాల నొప్పి:

గోళ్లు పళ్ళల్లో ఇరుక్కుపోయి దంతాల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలకు దారి తీస్తుంది. తద్వారా దంతాలతో నొప్పు వస్తుంది.

జీర్ణ సమస్యలు:

నోట్లో బాక్టీరియా ఇన్ఫెక్షన్ రావడం వల్ల బ్యాక్టీరియా స్టమక్ లోపలికి వెళ్లి పోతుంది. దీని కారణంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...