ఆర్థరైటిస్ సమస్యను ఎలా గుర్తించాలి..? ఎలా పూర్తిగా తగ్గించొచ్చు..?

-

ఈమధ్య కాలంలో చాలా మంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్థరైటిస్ తో చాలామంది బాధపడుతున్నారు. క్లిష్టమైన ఆర్థరైటిస్ వ్యాధి ప్రజలపై పంజా విసురుతోంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యకి గురవుతున్నారని వైద్యనిపుణులు అంటున్నారు. లక్షణాలని ముందే గుర్తించి చికిత్స తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు. బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి?, ఎలాంటి రకాలు ఇందులో ఉంటాయి?, ఎలా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు?, దీన్ని లక్షణాలు ఏంటి అనే వాటి గురించి ఇప్పుడే క్లియర్ గా తెలుసుకుందాం. వృద్ధుల్లో ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య వస్తుంది.

మహిళలు, యువతలో లూపస్ గా వేధిస్తుంది. ముఖంపై సీతాకోకచిలుక ఆకారంలోని ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఇంకొంత మంది గౌట్ తో బాధపడుతూ ఉంటారు. చేతులు, కాళ్ళ వేళ్ళు బాగాల్లో వాపులు, నొప్పి తీవ్రంగా ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి కారణంగా ఎముకలు పెళుసుబారి కీళ్ల నొప్పులు వేధిస్తాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ అనారోగ్య సమస్య. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వ్యాధినిరోధక శక్తి తిరిగి శరీరం పై దాడి చేసినప్పుడు ఈ అనారోగ్య సమస్య వస్తుంది. పిల్లల్లో కూడా ఇది వస్తోంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆరు వారాల కంటే ఎక్కువ కాలం కీళ్ల నొప్పులు, వాపులు ఉండడం, దీర్ఘకాలికంగా జ్వరం ఉండడం, ఎండ తగిలితే చర్మంపై దద్దుర్లు కలగడం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, కీళ్ల నొప్పులు, నోటిపూత, నోరు, చర్మం పొడిగా మారిపోవడం, ఉదయం పూట 45 నిమిషాల కంటే ఎక్కువసేపు వెన్ను లేదా మెడ నొప్పి రావడం, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం, చిన్నపిల్లల్లో కీళ్లనొప్పులు రావడం, కండరాల బలహీనత, నొప్పులు ఇవన్నీ కూడా లక్షణాలు. టాబ్లెట్స్ నుంచి అధునాతన బయోలాజికల్ ఇంజక్షన్లు, కార్టిసాల్ థెరపీ కూడా అందుబాటులో ఉంటుంది. స్టెరాయిడ్ వాడకంపై ఆందోళన చెందక్కర్లేదు. వైద్యుల పర్యవేక్షణలో స్వల్పకాలానికి స్టెరాయిడ్లను ఉపయోగించవచ్చు. అప్పుడు రిలీఫ్ కలుగుతుంది పూర్తిగా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version