కివితో కళ్ళు చెదిరే ఆరోగ్యం మీ సొంతం..

-

కివి పండు గురించి అందరికి తెలుసు. ఇది మనదేశం పండించకపోయిన కూడా మన దేశంలో యమ డిమాండ్ ఉందనే చెప్పాలి.రోజుకు ఒక పండును తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..ఇందులో ఉన్న పోషకాలు, విటమిన్లు మరే పండులో కనిపించవని నిపుణులు అంటున్నారు.రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది.బరువును అదుపులో ఉంచుకోవాలని అనుకొనేవాళ్ళు డైట్ లో ఈ పండును తప్పక చేర్చుకోవాలి.

మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి కివీ పండు మంచి ఔషదంగా పనిచేస్తుంది.అయితే ఈ పండు రుచికి పుల్లగా ఉంటుంది. దీన్ని తినడానికి పిల్లలు పెద్దగా ఆసక్తి చూపించరు అందుకే కొన్ని రకాల డిస్ ల రూపంలో ఇస్తే రుచితో పాటుగా మంచి ఆరోగ్యం కూడా..ఇక ఆలస్యం ఎందుకు కివి తో చేసే వంటలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కివి జ్యూస్..వేసవి కాలంలో పానీయాలను ఎక్కువగా సేవిస్తారు.అవి ఇవి కెమికల్స్ వేసినవి కాకుండా కివి జ్యూస్ చేసుకొని తాగడం మంచిది.శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. బాడీ డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది.

కివి స్మూతీ..ప్రోటీన్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అల్పాహారం కోసం ఇది గొప్ప ఎంపిక.పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు.

కివి పాన్ కేక్..పిల్లలు కేక్ లను ఎక్కువగా ఇష్టపడతారు..కివిని ఇలా తీసుకున్న మంచి ఉపయోగం ఉంది.తేనె లేదా మాపుల్ సిరప్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

ఇంకా కివీ మిల్క్‌షేక్‌, మాక్‌టెయిల్‌,కివి సల్సాలను కూడా ట్రై చెయొచ్చు. ఇలా కివిని ఎలా తీసుకున్నా కూడా మంచిదే.. చూసారుగా కివి తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటి నుంచి రోజుకో పండును తీసుకోవడం అలవాటు చేసుకోండి..మీ ఆరొగ్యాన్ని కాపాడుకోండి..

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version