కిడ్నీ లో రాళ్లతో బాధపడుతున్నారా? అయితే మొక్కజొన్న పీచుతో..?

-

ప్రతి ఒక్కరూ..మొక్క‌జొన్నపొత్తులని తిని వాటి పీచును వేస్ట్ అని ప‌డేస్తారు. ఈ పీచు మృదువుగా చూడ‌డానికి మెరుస్తూ ఉంటుంది.దీనిని సాధారణంగా జొన్న‌ ప‌ట్టు అంటారు. ఇందులో అనేక ఔషధగుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.

మ‌నం ఇష్టంగా తీసుకునే ఆహారాల్లో మొక్క‌జొన్న కూడా ఒక‌టి. తక్కువ ధరలో లభిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వేడివేడిగా మొక్క జొన్న పొత్తులను తినడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తారు.మొక్కజొన్నతో అనేక రకాలుగా ఆహారపదార్ధాల తయారు చేసుకుని తింటారు.

మొక్కజొన్న కండి మీద ఉండే పీచు ( కార్న్ సిల్క్ ) ని వివిధ దేశాల‌లో సంప్రదాయ వైద్యంలో ఎన్నో రకాల వ్యాధుల నివారణకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు,మూత్రాశయ ఇన్ఫెక్షన్‌లు,కిడ్నీ స్టోన్స్,ప్రోస్టేట్ వాపు వంటి వ్యాధులకు మంచి ఔషాదం గా పనిచేస్తుంది.ఈ కార్న్ సిల్క్ రక్తప్రసరణ లోపాలు, గుండె వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు, అలసట, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగిస్తారు. ఈ కార్న్ సిల్క్ నీటిని రోజూ తాగడం వలన కిడ్నీ పని తీరు మెరుగుపడుతుంది.

1).ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.దీంతో మొక్కజొన్న ప‌ట్టుతో టీ తాగ‌డం వలన శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శక్తి పెరుగుతుంది. ముఖ్యమైన అవ‌యవాల ప‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

2).ఈ టీలో కొద్దిగా నిమ్మర‌సాన్ని క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల కిడ్నీలోని స్టోన్స్ కరిగి మూత్రంలో బయటకు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

3).మొక్కజొన్న ప‌ట్టుతో చేసే టీ ని తాగ‌డం వ‌ల్ల జీర్ణవ్యవ‌స్థ మెరుగుప‌డి మ‌ల‌బ‌ద్దకం వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. అధిక బరువు తగ్గుతారు.అంతే కాకుండా ప్రస‌వానంత‌రం స్త్రీలు ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ర‌క్తస్రావం అధికంగా అవ‌కుండా ఉంటుంది.

4).కార్న్ సిల్క్ టీ తయారీ : మొక్కజొన్న పీచుని తీసుకుని ఒక కప్పు నీటిలో వేసుకుని వేడిచేయాలి.ఇందులో నిమ్మరసం వేసుకుని.. గోరువెచ్చగా తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు తాగడం వలన శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version