రోజూ మీరు చేసే ఈ 8 త‌ప్పుల వ‌ల్ల మీ ఆరోగ్యం దెబ్బ తింటుంద‌నే విష‌యం మీకు తెలుసా ?

నిత్యం మ‌నం పాటించే ఆహారపు అల‌వాట్లు, అనుస‌రించే జీవ‌న‌శైలి వ‌ల్లే మ‌న ఆరోగ్యం మారుతుంది. రోజూ ఆరోగ్య‌వంత‌మైన ఆహారాల‌ను తిన‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే వ్యాధులు వ‌స్తాయి. మొద‌ట చిన్న అనారోగ్య స‌మ‌స్య‌లే త‌రువాత దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లుగా మారుతాయి. దీంతో అవి ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అయితే రోజూ మ‌నం అనుస‌రించే ప‌లు విధానాల వ‌ల్ల మ‌న ఆరోగ్యాన్ని మ‌న‌మే నాశ‌నం చేసుకుంటున్నాం.. అనే మాట వాస్త‌వం. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. రోజూ శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ డి అందేలా చూసుకోక‌పోవ‌డం మ‌నం చేసే త‌ప్పుల్లో ఒక‌టి. విటమిన్ డి ల‌భించ‌క‌పోతే కేవ‌లం ఎముక‌లు మాత్ర‌మే కాదు, రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు కూడా నెమ్మ‌దిస్తుంది. దీంతో అనేక ర‌కాలుగా అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక విటమిన్ డి అందేలా చూసుకోవాలి. విట‌మిన్ డి మ‌న‌కు చేప‌లు, కోడిగుడ్డు ప‌చ్చ‌నిసొన‌, పుట్ట గొడుగులు, పాలు, నారింజ పండ్ల జ్యూస్‌లో ల‌భిస్తుంది.

2. రాత్రి పూట చాలా మంది ఆల‌స్యంగా నిద్రిస్తుంటారు. ఇది కూడా మ‌నం చేసే త‌ప్పుల్లో ఒక‌టి. దీంతో శ‌రీరానికి బాగా న‌ష్టం క‌లుగుతుంది. పైగా ఎక్కువ సేపు ఫోన్లు లేదా టీవీల ఎదుట కాల‌క్షేపం చేస్తారు. ఇది అత్యంత అనారోగ్య‌క‌ర‌మైంది. ఈ అల‌వాటును కూడా మానుకోవాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది.

3. రోజూ చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. దాన్ని త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయ‌రు. ఇది కూడా త‌ప్పే అవుతుంది. ఒత్తిడి అనేక వ్యాధుల‌కు కార‌ణం అవుతుంది. క‌నుక దీన్ని త‌గ్గించుకునే ప్ర‌యత్నం చేయాలి.

4. రోజూ వ్యాయామం చేయ‌క‌పోవ‌డం మ‌నం చేసే త‌ప్పుల్లో అది పెద్ద‌ది. దీంతో శ‌రీరం ఇంకా దెబ్బ తింటుంది. అనేక అనారోగ్యాలు వ‌స్తాయి. క‌నుక రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా స‌రే వాకింగ్ అయినా చేయాలి. దీంతో అనారోగ్యాలు రాకుండా చూసుకోవ‌చ్చు.

5. చ‌క్కెర ఎక్కువ‌గా తిన‌డం కూడా ఒక త‌ప్పు. చాలా మంది రోజూ షుగ‌ర్‌ను ఎక్కువ‌గా తింటుంటారు. ఇది అనేక అనారోగ్యాల‌కు మూల కార‌ణం. క‌నుక చ‌క్కెరను బాగా త‌గ్గించాలి.

6. రోజూ ప్ర‌కృతిలో గ‌డ‌ప‌క‌పోవ‌డం కూడా ఒక త‌ప్పే. ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో గ‌డ‌ప‌డం ద్వారా ఆరోగ్యం ఎంతో మెరుగు ప‌డుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక రోజూ కొంత సేపు ప్ర‌కృతిలో అలా విహ‌రించి రావాలి. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

7. బెడ్ మీద ప‌డుకుని చాలా మంది రాత్రి పూట ఫోన్ల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఇది కూడా త‌ప్పే. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. క‌నుక ఈ అల‌వాటును మానుకోవాలి.

8. చాలా మంది రోజూ త‌గినంత నీటిని తాగ‌రు. దీని వ‌ల్ల కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఆరోగ్యం దెబ్బ తింటుంది. క‌నుక ఈ త‌ప్పు కూడా చేయ‌రాదు. రోజూ నీటిని త‌గిన మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.