వేపాకు టీతో ఎంతో మేలు..!

-

‘అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు.. తినగ తినగ వేము తియ్యనుండు’ అనే పద్యాన్ని మన చిన్నప్పుడే చదివి ఉంటాం. కాని ఇప్పటి వరకూ మనలో కొందరూ కూడా వేపాకు ఉపయోగాలను తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండరు. వేపాకుతో మానవ శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరిస్తుంది. వేపాకుతో టీ చేదుగా ఉన్నాసరే అది అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. వేపాకు టీ అనేది ఒక హెర్బల్ టీ. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధాలు వేపాకును వాడతారు.

Neem-Tea

వేపాకు టీ తాగటం వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బ్యాక్టీరియా, వైరస్‌పై వేపాకు చక్కగా పోరాడుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. వేపాకు టీ తాగితే నోటి దుర్వాసన పోతుందట. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వర్క్ ప్రజర్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి ఊరట పొందేందుకు పురుషులు ఒక సిగిరెట్‌ను తాగి ఉపశమనం పొందుతుంటారు. కానీ అది ఆ క్షణానికి బాగున్నా భవిష్యత్‌లో లేనిపోని అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. దానికి బదులు ఎంచక్కా మీకు ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినా.. మనసు ప్రశాంతంగా లేకున్నా ఒక కప్పు వేపాకు టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. పురుషులకు, స్త్రీలకు చుండ్రు సమస్య పెద్ద తలనొప్పి. నీటిలో కొన్ని వేపాకులు వేసి బాగా మరిగించి దాన్ని చల్లారించాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేసి ఈ వేపాకు నీటితో మరోసారి శుభ్రంగా తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

దీన్ని అందరూ తాగకూడదండోయ్!
మంచి అందరికి మంచిదైనా.. కొందరికి విషం లాంటిది. అలాగే వేపాకు టీ ఆరోగ్యానికి మంచిదైనా సరే గర్భిణులు డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే వేపాకు టీ తాగటం మంచింది. పిల్లలకు పాలిచ్చే స్త్రీలు కూడా వేపాకు టీ తాగకూడదు. అవయవ మార్పిడి చేసుకున్నవారు, ఇటీవలే శస్త్రచికిత్స జరిగిన వారు కూడా వేపాకు టీకి దూరంగా ఉండాలి.

ఇంతకీ ఈ టీ ఎలా తయారు చేయాలి..?
వేపాకు టీని చేయటం చాలా సింపుల్.. రెండు కప్పుల నీటితో 6-10 వేపాకులు వేసి మరిగించాలి. అందులో బెల్లం లేదా చక్కెర వేస్తే చేదు ఉండదు.. మీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒకటి వేసుకోండి. నీళ్లు లైట్ గ్రీన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత వేడి వేడిగా తాగితే ఎంతో ఆరోగ్యానికి మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news