వర్కౌట్స్ చేసే ముందు వార్మప్ మర్చిపోతున్నారా? ఐతే ఇబ్బందులు తప్పవు..

-

పొద్దున్న లేవగానే వ్యాయామం అని చెప్పి మైదానంలోకో, జిమ్ కో వెళ్ళడం చేస్తున్నారు కదా! వ్యాయామం చేసే చాలా మంది మర్చిపోయే విషయం ఒకటుంది. అదే వార్మప్. శరీరాన్ని వార్మ్ చేయకుండా డైరెక్టుగా వ్యాయామంలోకి దిగకూడదనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యాయామానికి ఎంత ప్రాముఖ్యం ఉందో, వార్మప్ కి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. వార్మప్ వల్ల శరీరం వేడెక్కుతుంది. మన శరీర కండరాలు వ్యాయామం చేయడానికి ప్రిపేర్ అవుతాయి. సడెన్ గా గుండె వేగం పెరగకుండా మెల్ల మెల్లగా వ్యాయామానికి అలవాటు పడడానికి వార్మప్ పనిచేస్తుంది.

నిద్రలోంచి లేవగానే వ్యాయామం మొదలు పెట్టవద్దు. అప్పటి వరకూ విశ్రాంతి తీసుకున్న శరీరాన్ని వ్యాయామానికి ప్రిపేర్ చేసే విధంగా వార్మప్ ఉండాలి. వార్మప్ చేయకపోతే వచ్చే ఇబ్బందులేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

వ్యాయామంలో గాయాల బారి నుండి కాపాడుతుంది. వార్మప్ లేకుండా వ్యాయామం చేస్తే అది గాయాలకి దారి తీయవచ్చు. వ్యాయామంలో శరీరాన్ని ఎలా కావాలంటే అలా వంచుతాం. అప్పటి వరకూ విశ్రాంతి తీసుకున్న శరీరం, సడెన్ గా ఎటూ వంగదు. అలాంటప్పుడే గాయాలు అవుతాయి. అవి కాకుండా ఉండాలంటే వార్మప్ ఖచ్చితంగా అవసరం.

వార్మప్ వల్ల మన కీళ్ళలో ఎక్కువ చలనం ఉంటుంది. ఎటు కావాలంటే అటు సులభంగా తిరుగుతాయి.

కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది.

శరీరానికి ఆక్సిజన్ ని అందజేసి, కండరాలకి రక్త ప్రసరణని పెంచుతుంది.

సరైన వార్మప్ కి కావాల్సిన పరిమితులు

కనీసం పదినిమిషాల పాటైనా వార్మప్ చేయాలి.
మరీ తీవ్రంగా కాకుండా తక్కువ నుండి మధ్యస్థంగా వార్మప్ ఉండాలి.

చిన్నగా నడవడం, సైక్లింగ్, నెమ్మదిగా జాగింగ్ చేయడం, భుజాలు అటూ ఇటూ తిప్పడం మొదలగునవన్నీ వార్మప్ కిందకే వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news