అలాంటి వారు ఈ రసాన్ని తాగితే అంతేనా..?

-

ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఉక్కపోతతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే శరీరం కాస్త చల్లగా ఉండేందుకు మనకు దొరికేటువంటి కొన్ని పదార్థాలను బయట తాగుతూ ఉంటారు అలాంటి వాటిలో ముఖ్యంగా చెరుకు రసం కూడా ఒకటి అని చెప్పవచ్చు. చాలామందికి చెరుకు రసం లో మంచి ఖనిజాలు, పొటాషియం, ఐరన్ ఉంటాయని తెలిసిన విషయమే కావున ఈ వేసవి కాలంలో వీటిని తాగడం వల్ల మంచిదని నిపుణులు కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇవి అందరికీ మంచిది కాదని కూడా తెలియజేస్తున్నారు.

చెరుకు రసం తాగడం వల్ల కొంతమందికి ప్రాణహాని కలుగుతుందట. ఫుడ్ పాయిజనింగ్, దగ్గు, జలుబు, అధిక బరువు ఉన్న వారు ఈ రసాన్ని అసలు తాగకూడదని తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి వ్యక్తులైనా సరే వీటిని దూరంగా ఉంచడం మంచిదట. అయితే దీనిని ఎందుకు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1). ఫుడ్ పాయిజన్ తో ఇబ్బందిపడేవారు చెరుకు రసాన్ని అసలు తాగకూడదు ఎందుచేతనంటే ఇది సమస్యను మరింత పెంచేలా చేస్తుంది. చెరుకు రసాన్ని బయట తయారు చేస్తారు కనుక ఇందులో ఈగలు దుమ్ము వంటివి చెరుకు గడ్డలపై ఉంటాయి ఇవి చెరుకు రసాన్ని అనారోగ్యకరంగా చేస్తాయి.

2). జలుబు చేసినప్పుడు చెరుకు రసాన్ని ఎందుకు తాగకూడదు అంటే చెరుకు రసం చల్లదనాన్ని కలిగిస్తుంది అందువలన జబ్బు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

3). తల నొప్పి సమస్య ఉన్నవారు చెరుకు రసాన్ని తాగడం వదిలేయాలట ఎందుచేతనంటే చెరుకు రసం తాగడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

4). అత్యధిక బరువుతో బాధపడుతున్న వారు చెరుకు రసాన్ని తాగేవారు మానేయడం చాలా మంచిది. ఎందుచేతనంటే ఈ రసం తాగడం వల్ల ఇందులో ఉండే కేలరీలు బాగా పెరిగిపోతాయి ఇది బరువును మరింత పెంచేలా చేస్తాయి కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు నీ ఈ రసాన్ని దూరం పెట్టడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news