జీవితంలో స్నేహం ఎందుకు అవసరమో తెలుసా..?

-

సాధారణంగా మనకి స్కూల్ వయసు నుండి కూడా స్నేహితులు ఉంటారు. అలానే మనం ఎదిగే కొద్దీ మనకి కొత్త స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగం చేసిన, కాలేజీలో చదివిన లేదా వీధుల్లో ఆడుకుంటున్నా ఎంతో మంది స్నేహితులు పరిచయం అవుతూ ఉంటారు. జీవితంలో స్నేహం ఎందుకు ముఖ్యం..?, ఎందుకు ఒక మనిషికి స్నేహితుడు ఉండాలి..? మరి వీటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. కొందరు స్నేహితులు లేనిదే ఉండరు, కొందరికి కేవలం తక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఏది ఏమైనా కచ్చితంగా స్నేహితులు ప్రతి ఒక్కరికి ఉంటారు. అసలు స్నేహం ఎందుకు ముఖ్యం అనే విషయానికి వస్తే..

మాట్లాడడానికి :

స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఏదైనా విషయం కోసం చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది.అలాంటి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రియురాలైనా, తోటి ఉద్యోగస్తుడు అయినా ఇలా ఎవరైనా సరే.. మొదట ఫ్రెండ్ షిప్ వల్లే మనకి పరిచయం అవుతారు. అలానే స్నేహితులతో ఉండడం వల్ల ఎలా మాట్లాడాలి..?, ఎలా ఇతరులతో మనం ఉండాలి..?, ఎవరితో ఎలా మాట్లాడాలి అని ఇలాంటివి స్నేహం ద్వారా మనకు తెలుస్తాయి.

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు:

పరిశోధనలో తేలింది ఏమిటంటే స్నేహం వల్ల మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుందని. ఒత్తిడిని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో స్నేహితులు నేర్పిస్తారు. ఇలా అవి సులువుగా హ్యాండిల్ చేయడం మనకి తెలిస్తే మనం ఎంతో ప్రశాంతంగా మానసికంగా మరియు శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని స్నేహం ద్వారా నిలబెట్టుకోవచ్చు

ఒంటరిగా ఉన్నప్పుడు సహాయం చేయడం:

ఒంటరిగా ఉన్నప్పుడు లేదంటే కష్టాలు సంభవించినప్పుడు చాలా తోడుగా ఉంటారు. కనుక ఏ కష్టమైనా యిట్టె గట్టెక్కించేయొచ్చు.

జీవితం నాణ్యతని పెంపొందిస్తుంది:

క్వాలిటీ జీవితాన్ని గడపడానికి స్నేహం చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచిగా వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఫన్ ఉండడం, కేరింగ్, సపోర్టింగ్ ఇలాంటివి ఎన్నో స్నేహంతో కుదురుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version