మంచి అభిప్రాయం పొందాలనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసం…!

Join Our Community
follow manalokam on social media

ఎదుటి వాళ్ళకి మంచి అభిప్రాయం మీద కలగజేయాలని అనుకుంటున్నారా..? అది చాలా కష్టమైన పని. అయితే ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్’ కాబట్టి మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలంటే వీటి పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మరి దీని కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి.

పాజిటివ్ గా ఉండండి :

పాజిటివ్ గా ఉండడం వల్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మీ మాటలు, మీ బాడీ లాంగ్వేజ్ బట్టి మీ నడవడిక కనిపిస్తుంది. కొత్త వాళ్ళని కలిసినప్పుడు స్వచ్ఛమైన స్మైల్ తో స్వాగతం చెప్పడం లాంటివి ఇతరులు బాగా గమనిస్తారు. కాబట్టి వీటి మీద జాగ్రత్తగా ఉండండి.

బాడీ లాంగ్వేజ్:

బాడీ లాంగ్వేజ్ బట్టి మాట్లాడే వాళ్ళు మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారని పరిశోధన ద్వారా తేలింది. కాబట్టి మీరు మంచి బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళని ఇంప్రెస్స్ చేయండి. ఇది నిజంగా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది.

ఎటెన్షన్ లో ఉండండి:

ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఆసక్తి తో వినండి. అంతే కానీ ఎప్పుడు ఆపేస్తారు రా బాబు అన్నట్టు కాకుండా… వాళ్లు చెప్పేది పూర్తిగా వినండి.

కాస్త కొత్తగా ఉండండి:

మామూలుగా మాట్లాడుకునే వారి కంటే మీరు కాస్త డిఫరెంట్ గా ఉండే వాటి గురించి మాట్లాడండి. ఎప్పుడూ అందరూ చెప్పే మాటలే కాకుండా కాస్త కొత్తగా మాట్లాడండి.

ప్రశ్నల్ని అడగండి:

నెర్వస్ గా ఉండకుండా కొన్ని ప్రశ్నలు అడిగి మీ థాట్స్ ని మీరు ఎక్స్ ప్రెస్ చేయండి.

ఐ కాంటాక్ట్ ఇవ్వండి:

ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడటం నేర్చుకోండి. ఇవన్నీ మంచి అభిప్రాయాల్ని కలిగిస్తాయి. కాబట్టి మీరు వాటిని అనుసరించండి. దీంతో వాళ్ళకి మీ పట్ల మంచి ఇంప్రెషన్ కలుగుతుంది.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...