ఇలాంటి సంకేతాలు కనపడితే నష్టాలే..!

-

ఒక్కొక్క సారి మనకి ఇంట్లో ఏమైనా సమస్యలు కలుగుతున్నా లేదంటే రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఏమైనా వస్తున్నా కొన్ని సంకేతాలు కనబడుతూ ఉంటాయి. జీవితంలో ఏదైనా మంచి కానీ చెడు కానీ జరగాలి అంటే దానికి ముందు కొన్ని సంకేతాలు కనబడుతూ ఉంటాయి. కానీ చాలా మందికి ఆ సంకేతాలు అర్థం కావు. అర్థం చేసుకోలేరు.

పైగా ఇలా కొన్ని సంకేతాలు ఎదురవుతాయి అని మనం చెప్పినా సరే చాలా మంది నమ్మరు. వాళ్ల మనసు ఒప్పుకోవడానికి అంగీకరించదు. కానీ ఆచార చాణక్య చాణక్య నీతి ద్వారా కొన్ని సంకేతాల గురించి మనకి చెప్పారు అయితే ఈ సంకేతాలు కనుక కనపడ్డాయి అంటే ఇవి రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి అని అంటున్నారు. వాటిని మనం కనుక అర్థం చేసుకుని తగిన విధంగా అనుసరిస్తే సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. లేకపోతే లేనిపోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.

మీ ఇంట్లో కనుక తులసి మొక్క హఠాత్తుగా ఎండిపోయినట్లయితే అది ఇబ్బందులు రాబోతున్నట్లు సూచిస్తుంది అని అర్థం. కాబట్టి ఈ సంకేతం కనబడితే జాగ్రత్తగా ఉండండి. అలానే కలతలు కష్టాలు ఉన్న చోట డబ్బులు ఉండవు. లక్ష్మీదేవి అక్కడ ఉండదు అని ఆచార చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పారు.

అలానే చాకచక్యం లేని వ్యక్తులతో ఉంటే మీ ప్రవర్తన కూడా చెడుగా ప్రతికూలంగా మారిపోతుందని ఆచార్య చాణక్య చెప్పారు. అదే విధంగా చెడ్డదృష్టి ఉన్న వారితో కలిసి ఉంటే వారితో కలిసి ఉన్న వారికి కూడా అపవాదు వస్తుంది అని చాణక్య అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news