కష్టాలున్నా ఆ కాస్త నవ్వు…మ్యాజిక్ చేస్తుంది..!

-

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా దాటుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా కష్టాలు వచ్చినప్పుడు కుమిలిపోకుండా ఏ కష్టం వచ్చినా సరే నవ్వుతూ ముందుకు వెళ్లాలి. పైగా మనం కష్టాల్లో కూడా నవ్వుతూ ఉంటే సానుకూలంగా ఉండేందుకు అవుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాని గురించి పదే పదే టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఉంటే మీకు బాగుంటుంది.

 

అలానే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మీరు దానిని జాగ్రత్తగా దాటుతూ ఉంటే ఇతరులకు కూడా అది స్ఫూర్తిగా ఉంటుంది జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూపోతూ ఉంటాయి అయితే కష్టాలు ఉన్నాయని కుమిలిపోతూ బాధపడి పోవడం మంచిది కాదు. పైగా కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా నవ్వుతూ ఉంటే అది మిమ్మల్ని ప్రయత్నం చేసేలా చేస్తుంది.

ఓడిపోయినా సరే ఆ చిన్న చిరునవ్వు మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది అయితే జీవితంలో ఒడిదుడుకులు సహజం కాబట్టి బాధపడకండి చిన్న చిరునవ్వును పెదవిపై ధరించి మీరు కనుక ఉంటే అది మీకు ధైర్యాన్నిస్తుంది దానితో మీరు మళ్ళీ ఓడిపోకుండా చేస్తుంది. అంతేకానీ మీరు నవ్వకుండా ప్రతిసారి బాధపడుతూ ఉంటే ఆ బాధ లోనే ఉండిపోవాల్సి వస్తుంది. మరొకసారి విజయాన్ని అందుకోవడానికి అవ్వదు. మరొకసారి కనీసం ప్రయత్నం చేయడానికి కూడా అవ్వదు. కాబట్టి ఎంతటి కష్టం వచ్చినా సరే ఒక స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్లిపోండి.

Read more RELATED
Recommended to you

Latest news