వాస్తు: మట్టికుండలో నీళ్లు నింపి ఈ దిక్కులో ఉంచితే పాజిటివిటీని ఉంచచ్చు…!

-

మట్టి కుండలో నీటిని నింపి దానిని ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ పెట్టుకుంటే మంచి జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు. అయితే ఈ రోజు ఏ దిక్కు వైపు మట్టి కుండని నీటితో నింపి ఉంచాలి అనేది చూద్దాం..! ఈనాటి కాలం లో మట్టి కుండలు ఎక్కడో కాని ఉండట్లేదు.

ఇంక పట్టణాల్లో అయితే అవి కనే కనిపించడం లేదు. పల్లెటూరు లో మాత్రం చాలా మంది మట్టి కుండలని ఇంకా ఉపయోగిస్తున్నారు. చాలా మంది ఇళ్లల్లో మట్టి కుండ లో నీళ్లు పోసి ఆ నీటిని తాగుతూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఇప్పుడు ఉండే ఫిల్టర్స్ తో పోలిస్తే మట్టి కుండ లో నీళ్లు నింపి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయ పడతాయి. ఇది ఇలా ఉంటే మట్టి కుండ లో నీళ్లు పోసి ఏ దిక్కు వైపు ఉంచాలి..?, ఏ దిక్కు వైపు ఉంటే మనకు మంచి జరుగుతుంది అనేది చూస్తే… ఇది వాస్తు కి మాత్రమే కాదు ఇంట్లో పాజిటివిటీని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీసులో లేదా ఇంట్లో ఈ మట్టికుండలో నీళ్లు నింపి ఉత్తర దిక్కున ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరదిశ 5 మూలకాల లోని నీటి మూలకానికి సంబంధించినది. అగ్ని, గాలి, నీరు, భూమి మరియు ఆకాశం. ఇటువంటి సందర్భం లో ఉత్తర దిక్కు వైపు మట్టి కుండని ఉంచడం మంచిదని పండితులు చెబుతున్నారు. పైగా ఇది పాజిటివిటీని కూడా పెంపొందిస్తుంది. కాబట్టి తప్పక ఈ పద్ధతిని పాటించండి.

Read more RELATED
Recommended to you

Latest news